Nara Lokesh Comments On Cm Jagan: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' అంటూ నిరసనలు తెలుపుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోడ్ షోలు నిర్వహిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు నారా లోకేష్ యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నారు. 400 రోజులపాటు 4 వేల కిలో మీటర్లు ఆయన పాదయాత్ర సాగనుంది.
పాదయాత్రకు ముందే నారా లోకేష్ విమర్శలకు పదును పెడుతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ముసుగు తన్ని తొంగునే 50 ఏళ్ల ముసలి మూర్ఖుడు జగన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. పరదాల మధ్య పగటికలల నుంచి బయటికి రావాలన్నారు. జగన్ రెడ్డికి తెలిసినవి మూడే విద్యలు అని.. దోచుకోవడం, దాచుకోవడం, ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడమన్నారు. బారికేడ్లు అడ్డంపెట్టినా జనాలు సభల నుంచి పారిపోతుంటే.. కందకాలు తవ్విన దుర్మార్గ పాలకుడని ఆరోపించారు.
'సీఎం సీటు కోసం తండ్రి శవం పక్కనే సంతకాలు సేకరించాడు. ఓట్లు కోసం బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసి గుండెపోటని ప్రచారం చేసిన శవ రాజకీయాల బ్రాండ్ అంబాసిడర్. నీ ఓదార్పు, పాదయాత్రలకి చేసింది ఫ్రీ వెడ్డింగ్ షూట్లా..? మూడు తరాల మీ కుటుంబ అధికార, ధన దాహానికి నెత్తుటి సాక్ష్యాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. రాజకీయం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమా..? డెవలప్మెంట్ అంటే డ్రగ్స్, జె బ్రాండ్స్ అమ్మడమా..? ప్రజా సేవ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేదల్ని దోచుకోవడమా ఏ1 రెడ్డీ..? పాలనని ఫ్యాక్షన్ చేశావు. సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టావు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అథఃపాతాళంలోకి నెట్టావు.
బాబాయ్ హత్య నుంచి బయటపడేందుకు ప్రత్యేకహోదాని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తప్పించాలని రైల్వేజోన్‌ని, 38 క్రిమినల్ కేసుల్నించి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన నీచుడివి. నువ్వా చంద్రబాబు గారి గురించి మాట్లాడేది..? లండన్ మందులు డోస్ పెరిగిందో! డోస్ అందలేదో కానీ.. పెళ్ళిళ్ళు, పిల్లలు అంటూ వాగుతున్నావు. కోడి కత్తి నుంచి నేటి వరకూ నీ మాయమాటలు, నాటకాలు జనానికి తెలిసిపోయాయి. పాపాలు పండాయి. 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో..' అంటూ నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Also Read: PAK Vs NZ: క్రికెట్‌లో అరుదైన ఘటన.. ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు పాక్‌కు దెబ్బ.. 18 ఏళ్ల తరువాత ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి