India Cricket Team 2023 Schedules: బంగ్లాదేశ్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా.. 2022 సంవత్సరాన్ని ఘనంగా ముగించింది. అయితే గతేడాది భారత క్రికెట్ జట్టు కీలక మ్యాచ్‌ల్లో విఫలమైంది. ఆసియా కప్ ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టగా.. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లోనే ఓడిపోయింది. అదేవిధంగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. ఇక కొత్త సంవత్సరంలో టీమిండియా సరికొత్తగా ప్రయాణం ఆరంభించేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాది భారత క్రికెట్ పూర్తి షెడ్యూల్ వివరాలు ఇలా.
గత తొమ్మిదేళ్లుగా భారత జట్టు ఏ ఐసీసీ టోర్నీని గెలవలేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా గెలిస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్‌లో జరుగుతుంది.
టీమిండియా ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో, 2011లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో విశ్వకప్‌ను ముద్దాడింది. అయితే ఈ ఏడాది భారత్ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తుండడంతో టైటిల్‌ను గెలుచుకునేందుకు గట్టి పోటీగా మారింది.
జనవరి 2023: భారత్ Vs శ్రీలంక
1వ టీ20 (జనవరి 3) - ముంబై
2వ టీ20 (జనవరి 5) - పుణె
3వ టీ20 (జనవరి 7) - రాజ్‌కోట్
1వ వన్డే (జనవరి 10) - గౌహతి
2వ వన్డే (జనవరి 12) - కోల్‌కతా
3వ వన్డే (జనవరి 15) - తిరువనంతపురం
జనవరి/ఫిబ్రవరి 2023: భారత్ Vs న్యూజిలాండ్
1వ వన్డే (హైదరాబాద్)- 18 జనవరి
2వ వన్డే (రాయ్‌పూర్)- 21 జనవరి
3వ వన్డే (ఇండోర్)- 24 జనవరి
1వ టీ20 (రాంచీ)- 27 జనవరి
2వ టీ20 (లక్నో)- 29 జనవరి
3వ టీ20 (అహ్మదాబాద్)- 1 ఫిబ్రవరి
ఫిబ్రవరి/మార్చి 2023: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
1వ టెస్టు (నాగ్‌పూర్)- 9-13 ఫిబ్రవరి
2వ టెస్టు (ఢిల్లీ)- 17-21 ఫిబ్రవరి
3వ టెస్టు (ధర్మశాల) - 1-5 మార్చి
4వ టెస్టు (అహ్మదాబాద్) - 9-13 మార్చి
1వ వన్డే (ముంబై)- 17 మార్చి
2వ వన్డే (విశాఖపట్నం)- 19 మార్చి
3వ వన్డే (చెన్నై)- మార్చి 22
మార్చి-మే 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్
జూన్ 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్
జూలై/ఆగస్టు 2023: వెస్టిండీస్ VS ఇండియా
ఈ సిరీస్‌లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
సెప్టెంబర్ 2023: ఆసియా కప్ 2023
ఆసియా కప్ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే బీసీసీఐ, పీసీబీ మధ్య విభేదాల కారణంగా ఆతిథ్య జట్టులో మార్పు ఉండవచ్చు.
అక్టోబర్ 2023: భారత్ Vs ఆస్ట్రేలియా
ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి భారత్‌లో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది. షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
అక్టోబర్/నవంబర్ 2023: ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్. షెడ్యూల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు.
Also Read: Free Ration: రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. మరో ఏడాది పొడగింపు
Also Read: Earthquake In Delhi: ఢిల్లీలో అర్ధరాత్రి భూకంపం.. భయంతో జనం పరుగులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Team India: ఈ ఏడాది టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. ఆ సిరీస్ గెలిస్తే..
ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్
ఆతిథ్యం ఇవ్వనున్న భారత్
2023 టీమిండియా మ్యాచ్‌ల వివరాలు