Earthquake In Delhi: ఢిల్లీలో అర్ధరాత్రి భూకంపం.. భయంతో జనం పరుగులు

Earthquake Tremors in Delhi NCR: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ముగిసిన వెంటనే ఢిల్లీలో భూమి కంపించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం సంభవించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైనట్లు ఎన్‌సీఎస్ తెలిపింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2023, 08:23 AM IST
Earthquake In Delhi: ఢిల్లీలో అర్ధరాత్రి భూకంపం.. భయంతో జనం పరుగులు

Earthquake Tremors in Delhi NCR: కొత్త సంవత్సరం ప్రారంభమైన వెంటనే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. భూకంపం సంభవించిన వెంటనే భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో బయటకు వచ్చారు. నిద్రలో ఉన్న వ్యక్తులు ఈ ఘటన గురించి తెలుసుకోలేకపోయారు. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

ఆదివారం తెల్లవారుజామున 1:19 గంటలకు హర్యానాలోని ఝజ్జర్ వాయువ్య ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూమికి 5 కి.మీ. లోతులో భూకంప కేంద్రం గుర్తించారు. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో సంబరాల్లో మునిగిపోయి నిద్రపోతున్న ప్రజలకు భూకంప విషయం తెలియకుండా పోయింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. 

అంతకుముందు నవంబర్ 12న ఢిల్లీ ఎన్‌సిఆర్ అంతటా భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం భూకంస తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదైంది. ఇది నేపాల్‌లో రాత్రి 7:57 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని ఎన్‌సీఎస్ తెలిపింది.

దేశంలో భూకంపలను పర్యవేక్షించడానికి కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ ఏజెన్సీ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ. రోహ్తక్-ఝజ్జర్ గుండా వెళుతున్న మహేంద్రగఢ్-డెహ్రాడూన్ ఫాల్ట్ లైన్ దగ్గర తరచుగా భూకంపాలు సంభవిస్తాయని ఎన్‌సీఎస్ చెబుతోంది. ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించినప్పుడు హర్యానాలో భూమికి కేవలం 5 కిలోమీటర్ల దిగువన ప్రకంపనలు నమోదయ్యాయని వెల్లడించింది.

మరోవైపు ఢిల్లీలో భూకంప సంభవించడంపై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కొత్త ఏడాదికి మంచి ఆరంభం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు భూకంపం ఎప్పుడు వచ్చిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'దేవుడు విషెస్ చెప్పాడు.. ఇది హెచ్చరిక లేదా మరేదైనా..? ఢిల్లీలో భూకంపంతో కొత్త సంవత్సరం ప్రారంభమైంది..' అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

 

Also Read: Gas Cylinder Price: న్యూ ఇయర్ తొలి రోజే షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు

Also Read: IND Vs SL: కొత్త ఏడాదిలో లంకేయులతో తొలి సమరం.. టీమిండియా తుది జట్టు ఇదే.. \

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News