ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పలు హిందూ సంఘాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కత్తి మహేష్ ను ఐపీసీ 295(1), 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. వివిధ స్టేషన్లలో నాలుగు కేసులు నమోదయ్యాయని, ఈ క్రమంలోనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు, ఈ వ్యాఖ్యలను ప్రసారం చేసిన ఛానల్ ఆఫీసు వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. అంతకుముందు హిందువుల మనోభావాల్ని కించపరిచేలా మాట్లాడిన కత్తి మహేష్‌ను వెంటనే అరెస్టు చేయాలని స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు.
పోలీసుల అదుపులో కత్తి మహేష్