How To Increase Hdl Cholesterol: వింటర్ సీజన్‌లో మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే సీజన్ మారడం వల్ల చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కొందరిలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే మరికొందరిలో బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది పలు అనారోగ్యకరమైన ఆహారలను విచ్చలవిడిగా తినడం వల్లే కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే వానా కాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చలికాలంలో పొరపాటున కూడా వీటిని తినకండి:
జంక్ ఫుడ్:
జంక్ ఫుడ్ శరీరానికి చాలా హాని కలిగిస్తాయి. అయితే ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు వీటిని అతిగా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జంక్ ఫుడ్స్‌ను అతిగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు సులభంగా పెరుగుతాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.
ఫ్రై ఫుడ్స్:
ఫ్రై ఫుడ్స్ అతిగా తీసుకోవడం వల్ల కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల తీసుకోవడం వల్ల స్థూలకాయం పెరగడంతో పాటు శరీరంలో అనేక రకాల వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి.
తీపి పదార్థాలు:
స్వీట్లను ఎక్కువగా తీసుకోవడం కూడా శరీరానికి హానికరమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఎందుకంటే స్వీట్లలో చక్కెర, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అందుకే మిఠాయిలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరగడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్
Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి