Siddipet Road Accident: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి!

Five Persons Died in Siddipet Car Accident. సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్‌పూర్‌ మండలం మునిగడప శివారులో కారు అదుపుతప్పి గుంతలో పడింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 10, 2023, 05:35 PM IST
  • సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • ఐదుగురి మృతి
  • మరొకరి పరిస్థితి విషమం
Siddipet Road Accident: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి!

5 Died in Siddipet Car Accident: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్‌పూర్‌ మండలం మునిగడప శివారులో కారు అదుపుతప్పి గుంతలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మంగళవారం మధ్యాహ్నం మునిగడప శివారు మల్లన్నగుడి వద్ద కారు అదుపు తప్పింది. దాంతో రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది.   ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. ఇంకొకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని తెలుస్తోంది. కారు గుంతలో పడడం చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చి.. సహాయక చర్యలు చేపట్టారు. 

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి మృతుల వివరాలు సేకరిస్తున్నారు. కారును గుంతలోంచి బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కారు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read: Hyundai Cars Discontinued: హ్యుందాయ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. క్రెటా, వెర్నా, ఐ20లో 11 వేరియంట్‌లు నిలిపివేత!

Also Read: Tata Cars Offers 2023: టాటా కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా 75,000 తగ్గింపు! లిమిటెడ్ ఆఫర్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x