Grah Gochar 2023: త్వరలో బృహస్పతి సంచారం.. ఎవరికి లాభమో, ఎవరికి నష్టమో తెలుసుకోండి..

Grah Gochar 2023: గురువు బృహస్పతి తన సొంత రాశి అయిన మీనం నుండి బయటికి వెళ్లి మేషరాశిలో సంచరించనున్నాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2023, 10:07 AM IST
Grah Gochar 2023: త్వరలో బృహస్పతి సంచారం..  ఎవరికి లాభమో, ఎవరికి నష్టమో తెలుసుకోండి..

Grah Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి ఒక శుభ గ్రహంగా భావిస్తారు. బృహస్పతి తన రాశిని మార్చబోతున్నాడు. విద్య, సంతానం మెుదలైన వాటికి కారకుడిగా గురు గ్రహాన్ని భావిస్తారు. బృహస్పతి ఏప్రిల్ 22, 2023 ఉదయం 3:33 గంటలకు మీనరాశి నుండి బయలుదేరి తన మిత్రుడైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఎవరి జాతకంలో బృహస్పతి బలమైన స్థానంలో ఉంటాడో వారు సానుకూల ఫలితాలను పొందుతారు. ఎవరి జాతకంలో గురుడు అశుభ స్థానంలో ఉంటాడో వారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. బృహస్పతి రాశి మారడం వల్ల మేష, మిథున, కన్యా రాశుల వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

మేషరాశి (Aries): ఈ రాశికి చెందిన వారికి తొమ్మిదవ మరియు పన్నెండవ ఇంటికి బృహస్పతి అధిపతి. ఈ రాశిలోనే బృహస్పతి సంచారం జరగబోతుంది. ఈ సమయంలో మేషరాశి వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే సంతానం లేని వారికి పిల్లలు కలిగే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 

మిధునరాశి (Gemini): మిథున రాశి యెుక్క ఏడవ మరియు పదవ ఇంటికి బృహస్పతి అధిపతి. 11వ ఇంట్లో గురు సంచారం జరగబోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ లో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఇతరులతో సంబంధాలు  బలపడతాయి. వ్యాపారం వృద్ధి చెందే అవకాశం ఉంది. 

కన్య (Virgo): బృహస్పతి సంచారం కన్యారాశివారికి ప్రతికూలంగా ఉంటుంది. వీరి జాతకంలోని ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి సంచరించనున్నాడు. మీరు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడం మానుకోండి, లేకుంటే డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీరు ఏదైనా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. 

Also Read: Shukra Shani Yuti 2023: 30 ఏళ్ల తర్వాత కుంభంలో మిత్రుల కలయిక... వీరి ఇంటి నిండా డబ్బు కట్టలే ఇక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News