జనవరి మాసం శీతల గాలుల తీవ్రత పెరగడంతో ఉత్తరాది చలితో వణుకుతోంది. అటు హిమాలయ ప్రాంతాలు మంచుతో తడిసి ముద్దవడమే కాకుండా కప్పబడిపోతున్నాయి. భద్రీనాథ్ను మంచు ముంచేసింది. ఆ వివరాలు మీ కోసం..
హిమాలయ పరిసర ప్రాంతాలైన జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్ల మంచు ధారాళంగా కురుస్తోంది. అదే పనిగా మంచు కురుస్తుండటంతో ప్రముఖ పర్యాటక, ధార్మిక ప్రాంతాలైన భద్రీనాథ్, చమోలీ, జోషిమఠ్ ప్రాంతాల్లో మంచులో కూరుకుపోతున్నాయి. నివాస ప్రాంతాలు, చెట్లు, ఇళ్లు, రోడ్లు మంచుతో మూసుకుపోతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా పర్వత శ్రేణుల్లో మంచు ఏకధాటిగా కురుస్తోంది. మంచు కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పర్యాటకులు సైతం ఇబ్బందులు ఎదురౌతున్నా..మంచుని ఎంజాయ్ చేస్తున్నారు.
సుప్రసిద్ధ హిమాలయ పర్వతశ్రేణి కాంగ్రా లోయ సమీపంలోని దౌలాధర్లో ఈ సీజన్లోనే అత్యధికంగా మంచు కురవడంతో మొత్తం మూసుకుపోయింది. ఉష్ణోగ్రత పడిపోవడంతో నీళ్లు గడ్డకట్టుకుపోతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో భారీ హిమపాతం కారణంగా రహదారులపై వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. సిమ్లాలో పరిస్థితి మరీ దయనీయం. ఏకంగా 210 రోడ్లు మూసుకుపోయాయి. నేషనల్ హైవే క్లోజ్ అయింది. ప్రతికూల వాతావరణం ప్రభావంతో శ్రీనగర్ విమానాశ్రయం క్లోజ్ అయింది.
ఇక ధార్మిక ప్రాంతాల విషయంలో మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రంలో హెలీకాప్టర్, బ్యాటరీ కార్ సేవలు నిలిచిపోయాయి. ఇవాళ్టి నుంచి అంటే జనవరి 14 నుంచి ఉత్తర భారత ప్రాంతాలు తీవ్రమైన శీతల ప్రభావానికి గురికానున్నాయని అంచనా. అటు ప్రముఖ శివక్షేత్రం భద్రినాథ్ దాదాపు మంచులో కప్పబడిపోయింది. ఇక జోషిమఠ్‌లో ఓ వైపు మంచు కురుస్తున్నా..ఆ ప్రాంతంలో ఏర్పడుతున్న పగుళ్ల కారణంగా కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.
Also read: Sharad Yadav's Death News: శరద్ యాదవ్ మృతి.. రాజకీయ ప్రస్థానం కొనసాగిందిలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook