Sunil Gavaskar: టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరం.. సునీల్ గవాస్కర్ ఏం చెప్పారంటే..?

Sunil Gavaskar on Virat Kohli and Rohit Sharma: టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇక కనిపించరా..? సెలెక్టర్లు ఎందుకు ఈ ఇద్దరు ఆటగాళ్లను వరుసగా అన్ని సిరీస్‌లకు పక్కపెడుతున్నారా..? వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో వీరిద్దరు ఆడతారా..? సునీల్ గవాస్కర్ ఏం చెబుతున్నారు..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 01:50 PM IST
Sunil Gavaskar: టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరం.. సునీల్ గవాస్కర్ ఏం చెప్పారంటే..?

Sunil Gavaskar on Virat Kohli and Rohit Sharma: టీ20 ఫార్మాట్‌కు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీని బీసీసీఐ పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతేడాది టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్‌లో ఓటమి తరువాత బీసీసీఐ ప్రక్షాళన మొదలుపెట్టింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని.. టీమ్‌ను నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే యంగ్ ప్లేయర్లకు సాధ్యమైనన్ని అవకాశాలు ఇవ్వాలని చూస్తోంది. న్యూజిలాండ్, శ్రీలంకలో జరిగిన టీ20 సిరీస్‌లతో పాటు తాజాగా న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని దూరం పెట్టింది. ఈ నేపథ్యంలోనే వీరిద్రి టీ20 అంతర్జాతీయ కెరీర్ ఇక్కడితో ముగిసిందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ విషయంపై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ను ప్రశ్నించగా.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనున్న తరుణంలో కొత్త సెలక్షన్ కమిటీ 
ఎక్కువ మంది యువకులకు అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. అయితే రోహిత్, కోహ్లీ పేర్లను పరిగణనలోకి తీసుకోరని దీని అర్థం కాదన్నారు. వీరిద్దరూ 2023లో తమ మంచి ప్రదర్శనను కొనసాగిస్తే.. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టులో చోటు దక్కుతుందన్నారు.

త్వరలో ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 జట్టులో విరాట్, రోహిత్‌లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చి ఉండవచ్చన్నారు సునీల్ గవాస్కర్. వారు ఈ కీలక సిరీస్‌లో కీలకం కానున్నారని అన్నారు.

ప్రస్తుతం టీమిండియా తీరికలేని క్రికెట్ ఆడుతోంది. ఒక సిరీస్ ముగిసిన వెంటనే మరో సిరీస్ ప్రారంభమవుతుంది. ఇలాంటి తరుణంలో నిరంతరం క్రికెట్ ఆడటం వల్ల ఆటగాళ్లు అలసిపోయే అవకాశం ఉంది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా సెలక్టర్లు రెస్ట్ ఇస్తున్నారు. టీమిండియాకు బలమైన రిజర్వ్ బెంచ్ బలం ఉంది. జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విరాట్, రోహిత్ వంటి స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినా.. భారత జట్టు ప్రత్యర్థుల కంటే బలంగా కనిపిస్తోంది. 

Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్  

Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News