Filght Ticket Offers: ఫ్లైట్ టికెట్స్‌పై బంపర్ ఆఫర్.. దేశంలో ఎక్కడికైనా రూ.1199కే ప్రయాణం

Cheap Flight Tickets: విమాన ప్రయాణికులకు గో ఫస్ట్ కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఫ్లైట్ టికెట్స్‌పై భారీ డిస్కౌంట్ ఇచ్చింది. దేశంలో ఎక్కడికైనా కేవలం రూ.1199కే టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే ఉండనుంది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 02:31 PM IST
  • విమాన ప్రయాణికులకు శుభవార్త
  • రూ.1199కే టికెట్ బుక్
  • ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే..
Filght Ticket Offers: ఫ్లైట్ టికెట్స్‌పై బంపర్ ఆఫర్.. దేశంలో ఎక్కడికైనా రూ.1199కే ప్రయాణం

Cheap Flight Tickets: ఇండియన్ ఎయిర్‌లైన్స్ గో ఫస్ట్ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.1199కే మీ విమాన టిక్కెట్‌ను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దేశీయ టిక్కెట్లతో పాటు అంతర్జాతీయ టిక్కెట్లు కూడా తక్కువ ధరకే లభిస్తాయి. రూ.1199తో దేశీయ విమాన ప్రయాణం చేయవచ్చని అధికారిక ట్వీట్‌లో గో ఫస్ట్ పోస్ట్ చేసింది. దీంతో పాటు అంతర్జాతీయ ప్రయాణానికి రూ.6599 వెచ్చించాల్సి ఉంటుందని వెల్లడించింది.

గో ఫస్ట్ కంపెనీ ఈ ఆఫర్‌లో మీరు ఫ్రీగా రీషెడ్యూలింగ్ సదుపాయాన్ని పొందుతున్నారు. దీంతో పాటు మీరు ఉచిత రద్దు ప్రయోజనం కూడా పొందుతారు, అంటే రు టికెట్ రద్దు చేసినా.. ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. గో ఫస్ట్ ఈ సేల్‌లో ఒక మిలియన్ కంటే ఎక్కువ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్‌లో ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లతో మీరు ఫిబ్రవరి 4 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో ప్రయాణించవచ్చు. మీరు రాబోయే 8 నెలలకు టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. 

గో ఫస్ట్ సీఈవో కౌశిక్ ఖోనా మాట్లాడుతూ.. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులకు సరసమైన, సౌకర్యవంతమైన విమాన ప్రయాణాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. పూర్తి వివరాల కోసం www.flygofirst.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఇటీవలె 55 మంది ప్రయాణికులకు గో ఫస్ట్ కంపెనీ ఉచిత విమాన టిక్కెట్లను ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం గో ఫస్ట్ విమానం 55 మంది ప్రయాణికులను విమానాశ్రయంలో వదిలివేసి వెళ్లిన విషయం తెలిసిందే. వీరందరూ బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా.. ప్రయాణికులను తీసుకోకుండానే విమానం వెళ్లిపోయింది. విమానం ఎక్కేందుకు ప్రయాణికులు చెక్ ఇన్, బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నారు. అయినా విమానం వీరికి ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలేసి వెళ్లిపోయింది. అనంతరం ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన గో ఫస్ట్ కంపెనీ.. 12 నెలల్లో ఈ ప్రయాణికులు దేశంలోని ఏ నగరానికైనా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా సంఘటనకు కారణమైన విమానంలోని సిబ్బంది అందరినీ తాత్కలికంగా తొలగించింది.

Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్  

Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News