India Vs New Zealand 2nd Odi Updates: భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో ఉత్కంఠభరిత పోరులో టీమిండియా చివరి ఓవర్‌లో గెలుపొందింది. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ ఛేజిక్కించుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా తుదిజట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. శార్దుల్ ఠాకూర్ ప్లేస్‌లో ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకుంటారని ప్రచారం జరిగినా.. ఈ స్పీడ్‌స్టార్‌కు నిరాశ తప్పలేదు.
A look at #TeamIndia's Playing eleven as we remain unchanged for the second #INDvNZ ODI👌🏻
Follow the match ▶️ https://t.co/V5v4ZINCCL @mastercardindia pic.twitter.com/ibbgWvzuUg
— BCCI (@BCCI) January 21, 2023
అయితే టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకోవాలా.. బౌలింగ్ ఎంచుకోవాలనే విషయం మర్చిపోయాడు. 12 సెకెన్ల పాటు ఆలోచించి.. చివరకు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో కామెంటేటర్‌గా ఉన్న రవిశాస్త్రి ఏమైంది రోహిత్ అంటూ ప్రశ్నించాడు.
'మేము ఏమి చేయాలనుకుంటున్నామో నేను మర్చిపోయాను. టాస్ నిర్ణయం గురించి డ్రెసింగ్ రూమ్‌లో జట్టుతో చాలా చర్చించాం. క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని మనం నిరూపించుకోవాలి. కష్టసమయాల్లో ఎలా ఆడాలనేది ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి. మేం బౌలింగ్ చేయాలని అనుకుంటున్నాం. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని తెలుసు. కానీ ఇది మాకు సవాల్. గత మ్యాచ్‌లో రేస్‌వెల్ బాగా బ్యాటింగ్ చేశాడు. కానీ చివరికి మేము బాగా బౌలింగ్ చేసి గేమ్‌ను గెలుచుకున్నాము. ప్రాక్టీస్ సెషన్‌ల సమయంలో కొంచెం మంచు కురిసింది. కానీ ఆట సమయంలో ఇది పాత్ర పోషించదని క్యూరేటర్ నుంచి చెప్పారు. మేము హైదరాబాద్‌లో మొదట బ్యాటింగ్ చేశాము. ఇక్కడ మొదట బౌలింగ్ చేయాలనుకున్నాము. తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేవు..' అని రోహిత్ శర్మ తెలిపాడు.
🚨 Toss Update 🚨#TeamIndia win the toss and elect to field first in the second #INDvNZ ODI.
Follow the match ▶️ https://t.co/V5v4ZINCCL @mastercardindia pic.twitter.com/YBw3zLgPnv
— BCCI (@BCCI) January 21, 2023
'మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. ఈ వికెట్ ఎలా ఉంటుందో కచ్చితంగా తెలియదు. గత మ్యాచ్‌లో మేము బ్యాటింగ్‌లో మెరుగ్గా ఆడాం. ఈ మ్యాచ్‌లోనూ అదే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. అయితే మ్యాచ్ గెలవడం ముఖ్యం. గత మ్యాచ్‌లో లోపాలను సరిదిద్దుకుంటాం. అయితే ఈ పరిస్థితుల్లో ఆడిన అనుభవం కూడా ఉపయోగపడుతుంది. ఇష్ సోధి ఇంకా కోలుకోలేదు. మేము అదే జట్టుతో ఆడుతున్నాము..' అని కివీస్ కెప్టెన్ టిమ్ లాథమ్ తెలిపాడు.
తుది జట్లు ఇలా..
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్, హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్
Also Read: IND VS NZ: నేడే రెండో వన్డే.. కోహ్లీని ఊరిస్తున్న మరో రికార్డు
Also Read: Hyper Aadi: 2024లో జనసేన ప్రభుత్వం.. సినిమాటోగ్రఫీ మంత్రిగా హైపర్ ఆది.. పోస్టులు వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి