Joel Paris Concedes 16 Runs in One Ball at BBL 2023: సాధారణంగా క్రికెట్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు వస్తుంటాయి. బ్యాటర్ సిక్సుల వర్షం కురిపిస్తే.. 36 రన్స్ కూడా వస్తాయి. ఒకే ఓవర్లో 20కి పైగా పరుగులు రావడం నిత్యం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఓ బంతికి 10 రన్స్ కంటే ఎక్కువ రావడం చాలా అరుదు. తాజాగా ఓ లీగల్ డెలివరీకి ఏకంగా 16 పరుగులు వచ్చాయి. ఈ ఘటన ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోమవారం బిగ్ బాష్ లీగ్ 2022-23లో భాగంగా సిడ్నీ సిక్సర్స్, హోబర్ట్ హరికేన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సిడ్నీ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోయెల్ పారిస్ వేశాడు. ఈ ఓవర్లోని తొలి రెండు బంతులను ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్.. ఒక్క పరుగు కూడా చేయలేదు. మూడో బంతికి స్మిత్ సిక్సర్ బాధగా.. ఆ బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దాంతో 7 పరుగులు వచ్చాయి. తర్వాతి బంతికి కూడా 5 పరుగులు (వైడ్+ఫోర్) రావడంతో 12 పరుగులు జతయ్యాయి. తర్వాత వేసిన ఫ్రీ హిట్‌ని స్మిత్ బౌండరీకి పంపాడు. దీంతో జోయెల్ ఒక బంతికి 16 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోయెల్ పారిస్ వేసిన బౌలింగ్‌కు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోని KFC Big Bash League తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఒక లీగల్ డెలివరీకి 16 పరుగులు వచ్చాయి' అని పేర్కొంది. పాపం జోయెల్ పారిస్ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఆలస్యం ఎందుకు మీరు వీడియో చూసేసయండి.
15 runs off one legal delivery! 😵💫
Steve Smith's cashing in once again in Hobart 🙌#BucketBall #BBL12 pic.twitter.com/G3YiCbTjX7
— KFC Big Bash League (@BBL) January 23, 2023
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (66; 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంటిరీ బాదాడు. అనంతరం హోబర్ట్ హరికేన్స్ 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులే చేసి.. 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. జాక్ క్రాలే (49) టాప్ స్కోరర్. స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.