Rajyog: త్వరలో అరుదైన రాజయోగం... ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Akhand Samrajya Rajyog:  జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అఖండ సామ్రాజ్య యోగం చాలా అరుదుగా సంభవిస్తుంది. ఈ యోగం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2023, 04:39 PM IST
Rajyog: త్వరలో అరుదైన రాజయోగం... ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Akhand Samrajya Rajyog: గ్రహాల గమనంలో మార్పు కారణంగా యోగాలు మరియు దోషాలు ఏర్పడతాయి. ఎవరి జాతకంలో శుభ యోగాలు ఏర్పడతాయో వారికి దేనికీ లోటు ఉండదు. ఏ వ్యక్తి కుండలిలో దోషాలు ఏర్పడతాయో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోంటారు. త్వరలో శనిదేవుడు, బృహస్పతి గ్రహాల కలయిక కారణంగా అరుదైన అఖండ సామ్రాజ్య రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం మూడు రాశులవారికి అనుకూలంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

అఖండ సామ్రాజ్య రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
మేషరాశి (Aries): మేషరాశిలో బృహస్పతి సంచారం కారణంగా అఖండ సామ్రాజ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మీరు ఆర్థికంగా బలపడతారు. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు మంచి లాభాలను గడిస్తారు. స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్న వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 

మిథునం (Gemini): అఖండ సామ్రాజ్య రాజయోగం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. శని, బృహస్పతి సంచారం వల్ల మిథునవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగులు జాబ్ మారడానికి ఇదే మంచి సమయం. 

మకరం (Capricorn): గురు, శని కలయిక వల్ల అఖండ సామ్రాజ్య రాజయోగం మకరరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. శనిదేవుడు మీ సంపదను రెట్టింపు చేస్తాడు. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సంబంధాలు బలపడతాయి. పెండింగ్ లో  ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. 

Also Read: Gajakesari Yoga: మీన రాశిలో గజకేసరి రాజయోగం.. ఈ రాశులవారికి ఊహించని ధనలాభం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News