ఈ కేసు కర్నూలు జిల్లాలోని అహోబిలం ఆలయానికి సంబంధించింది. ఈ ఆలయానికి ఈవోను నియమిస్తూ..నిర్వహణలు తమ చేతుల్లో తీసుకోవాలనుకున్న ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ బడింది. ఏపీ అభ్యర్ధనను సుప్రీంకోర్టు సైతం తిరస్కరించింది.
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని అహోబిలం ఆలయానికి ఈవోను నియమించడం ద్వారా ఆ ఆలయం నిర్వహణ, నియంత్రణకై ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ఆలయ మఠాధిపతులు అభ్యంతరం తెలిపారు. ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం ప్రకారం మఠానికి లేదా ఆలయానికి ఈవో నియమించే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని పిటీషనర్ తెలిపారు. ఈ ఆలయం ఛాప్టర్ 5 ప్రకారం ప్రత్యేక హోదా కలిగి ఉందన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. ప్రభుత్వానికి ఆ అధికారం లేదని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 డి ప్రకారం మఠాధిపతి హక్కుల్ని కాలరాయడమేనని వెల్లడించింది. 1927 ఎండోమెంట్స్ చట్టం ప్రకారం అహోబిలం ఆలయం మఠాధిపతుల నిర్వహణ కిందే ఉందని..ప్రభుత్వ ఆధీనంలో లేదని హైకోర్టు తెలిపింది.
అహోబిలం ఆలయం విషయంలో ఏపీ హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా బెంచ్ ముందుకు వచ్చింది. అయితే ఆలయ విషయాల్లో ప్రభుత్వ జోక్యంపై సుప్రీంకోర్టు బెంచ్ అంగీకరించలేదు. ఆలయం విషయంలో మీరెందుకు కలగజేసుకుంటున్నారని జస్టిస్ కౌల్ ప్రభుత్వం తరపు న్యాయవాది నిరంజర్ రెడ్డిని ప్రశ్నించారు. ఆలయాన్ని ఆలయ సిబ్బందినే చూసుకోమని చెప్పండి, మతపరమైన స్థలాల్ని ఆధ్యాత్మిక వ్యక్తులకు ఎందుకు వదిలేయరని బెంచ్ ప్రశ్నించింది.
హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు బెంచ్ తిరస్కరించింది. ఆలయాన్ని గుడికి సంబంధించిన వ్యక్తులకే వదిలేయాలని ఆదేశించింది.
Also read: Nasal Vaccine: సూపర్ గుడ్‌న్యూస్.. ఇంట్రానాసల్ వ్యాక్సిన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook