విటమిన్ ఇ శరీరానికి చాలా అవసరమైన పోషక పదార్ధం. విటమిన్లు, ఖనిజాల కోసం ప్రకృతిలో లభించే వివిధ రకాల ఆహార పదార్ధాలు చాలు. విటమిన్ ఇ శరీరానికి ఎంతవరకూ అవసరం, ఏయే పదార్ధాల్లో పుష్కలంగా లభిస్తుందనేది తెలుసుకుందాం.
మనిషి శరీరంలో వివిధ రకాల విటమిన్లు బ్యాలెన్స్‌గా ఉండాలి. విటమిన్ల సమతుల్యత లోపిస్తే వివిధ రకాల సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందుకే విటమిన్ ఇ అవసరం . విటమిన్ ఇ తక్కువైతే ప్రధానంగా రెండు సమస్యలు వెంటాడుతాయి. ఒకటి చర్మ సంబంధిత వ్యాధులైతే..రెండవది కంటి చూపు సమస్య. మనిషి శరీరం మెకానిజంను అంటే మెటబోలిజంను బలోపేతం చేయడంలో ఇ విటమిన్ చాలా దోహదపడుతుంది.
ఇ విటమిన్ అనేది శరీరంలో ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షించేది విటమిన్ ఇ మాత్రమే. అందుకే రోజువారీ ఆహారంలో తప్పకుండా విటమిన్ ఇ తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి.
ఇక విటమిన్ ఇక అధికంగా లభించే మరో పదార్ధం బాదం. ఇందులో అనేక పోషకాలుంటాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది. అన్ని రకాల యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో ఉంటాయి. బాదంలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దాంతో శరీరానికి కావల్సిన విటమిన్ ఇతో పాటు కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా లభ్యమౌతాయి.
ఇక హాజెల్ నట్స్ కూడా విటమిన్ ఇకు మంచి ప్రత్యామ్నాయం. సెల్ డ్యామేజ్ నుంచి నూటికి నూరుశాతం రక్షణ అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. హాజెల్ నట్స్‌లో ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది.
ఇక మరో ముఖ్యమైంది రోజూ ఉపయోగించేది సన్‌ఫ్లవర్ ఆయిల్. బియ్యం ఊక, గోధుమ జెర్మ్, ఆలివ్, పొద్దుతిరుగుడు, సోయాబీన్, మొక్కజొన్న నూనె మొదలైన కూరగాయల నూనెలు విటమిన్ ఇకు గొప్ప వనరులు. అన్ని కూరగాయల నూనెలు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. సన్ ఫ్లవర్ ఆయిల్లో మాత్రం విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. నాలుగవది అవకాడో. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే పండు. శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్ అన్నీ ఉంటాయి.
డ్రై ఫ్రూట్స్‌లో ఆవకాడో అతి ముఖ్యమైంది. రోజుకు ఒక అవోకాడో తింటే చాలు శరీరానికి అవసరమైన మొత్తంలో విటమిన్ ఇ లభిస్తుంది. ఇక పొద్దు తిరుగుడు విత్తనాలు. కాల్చిన పొద్దు తిరుగుడు నూనె గింజలలో 75 శాతం కంటే ఎక్కువ విటమిన్ ఇ ఉంటుంది. మెరుగైన ఆరోగ్యం కోసం ఇది చాలా ఉపయోగం.
Also read: Health tips: తేనె రోజూ ఇలా తీసుకుంటే..ఆ సమస్యలన్నీ 4 వారాల్లో మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook