Income Tax Exemption Limit 2023: ఇన్‌కమ్ టాక్స్ లిమిట్ పెంపు.. ఎంత ఆదాయం వరకు టాక్స్ వర్తించదంటే..

Budget 2023 Live Updates: బడుగు జీవులకు ఆదాయ పన్ను మినహాయింపుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు ఇన్‌కమ్ టాక్స్ రిబేట్ రూ. 5 లక్షలుగా ఉండగా కేంద్రం ఈ ఏడాది నుంచి ఇన్‌కమ్ టాక్స్ ఇన్‌కమ్ టాక్స్ రిబేట్‌ని రూ. 7 లక్షలకు పెంచింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2023, 01:14 PM IST
Income Tax Exemption Limit 2023: ఇన్‌కమ్ టాక్స్ లిమిట్ పెంపు.. ఎంత ఆదాయం వరకు టాక్స్ వర్తించదంటే..

Budget 2023 Live Updates: 2023 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్ ప్రకారం 3 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు ఉండగా.. రూ. 3 లక్షల నుంచి 6 లక్షల వరకు 5 శాతం పన్ను వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుత ఇన్‌కమ్ టాక్స్ లిమిట్ ప్రకారం రూ. 5 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వార్షిక ఆదాయం కలిగిన వారు 10 శాతం టాక్స్ చెల్లిస్తుండగా.. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విధానం మారనుంది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన వివరాల ప్రకారం 9 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల ఆదాయంపై 15 శాతం ఆదాయ పన్ను వర్తించనుండగా 12 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఆదాయం కలిగిన వారు 20 శాతం టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారు గరిష్టంగా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : Union Budget 2023 Live udpates: రైల్వే, వ్యవసాయ రంగాలకు  బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత, కొనసాగుతున్న బడ్జెట్ ప్రసంగం

ఇది కూడా చదవండి :  Union Budget 2023: బడ్జెట్ కారణంగా స్టాక్‌ మార్కెట్‌ ఈ సారి కూడా కుదేలవుతుందా.?

ఇది కూడా చదవండి : Union Budget 2023: బడ్జెట్ 2023.. ప్రత్యేక ఆకర్షణగా నిర్మలా సీతారామన్‌ చీరకట్టు! 2019 నుంచి ప్రత్యేక వస్త్రధారణ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News