శుక్ర గ్రహాన్ని సుఖం, వైభవం, సౌందర్యం, భోగ విలాసం, భౌతిక సుఖ సంతోషాలకు కారకుడిగా భావిస్తారు. అందుకే శుక్రుడు ఏ రాశి కుండలిలో శుభ స్థితిలో ఉంటాడో..ఆ జాతకులకు చాలా లాభం కలగనుంది. పూర్తి వివరాలు మీ కోసం..
ఫిబ్రవరి 15వ తేదీన శుక్రుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. మీనరాశి అధిపతి గురువు అప్పటికే ఈ రాశిలో ఉండటంతో ఈ రెండు గ్రహాల కలయికతో శుభ సంయోగం ఏర్పడనుంది. ఈ సంయోగంతో కొన్ని రాశులకు అంతా అనుకూలంగా ఉంటుంది. వేసే ప్రతి అడుగులో విజయం లభిస్తుంది. ప్రతి పని సఫలమౌతుంది.
మీన రాశి
శుక్రుడు మీన రాశిలో ఉన్నత స్థితిలో ఉంటాడు. ఈ క్రమంలో శుక్రుడి గోచారం ఈ రాశివారికి చాలా లాభదాయకంగా ఉండనుంది. శుక్రుడు మీన రాశి కుండలిలో లగ్నపాదంలో గోచారం చేయనున్నాడు. దాంతో మాలవ్య రాజయోగం ఏర్పడి..ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృష్టం తోడవడంతో ప్రతి పని పూర్తవుతుంది. సమాజంలో, పనిచేసేచోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డబ్బులు వచ్చే మార్గాలు కొత్తగా తెర్చుకుంటాయి. ఉద్యోగం కోసం అణ్వేషించేవారి కోర్కెలు నెరవేరుతాయి.
మిథునం
శుక్రుడు మిధున రాశి జాతకుల కుండలిలో పదవ పాదంలో గోచారం చేయనున్నాడు. దీనిని కర్మ, సుఖాలకు వేదికగా పిలుస్తారు. దీంతో మాలవ్య రాజయోగం ఏర్పడి ఈ రాశివారికి అంతులేని ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. అటు ఉద్యోగార్ధులకు చాలా మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ సందర్భంగా ఆస్థులు, వాహనాలు కొనుగోలు చేయవచ్చు.
కన్యా రాశి
శుక్రుడి గోచారంతో ఏర్పడే మాలవ్య రాజయోగం కన్యారాశిలో 7వ పాదంలో ఉండనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాజయోగం చాలా శుభసూచకం. దీంతో అన్ని రకాల సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి చాలా లాభాలుంటాయి. ఈ సందర్భంగా అదృష్టం ప్రతి దశలో తోడవుతుంది
ధనస్సు రాశి
శుక్రుడు ఫిబ్రవరి 15వ తేదీన ధనస్సు రాశి నాలుగవ పాదంలో గోచారం చేయనున్నాడు. దీంతో ఈ రాశి జాతకులకు అదృష్టం తోడుగా ఉంటుంది. పనిచేసేచోట కొత్త బాథ్యతలు లభించడంతో ఆనందంగా ఉంటారు. వ్యాపారపరంగా కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇందులో అధిక లాభాలుంటాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి లభిస్తుంది.
Also read: Budh gochar 2023: మరో 4 రోజుల్లో ఈ 5 రాశులపై ధనవర్షం, ఉద్యోగంలో పదోన్నతి, అంతులేని లాభాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook