ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షత జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న పలు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్.
ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిసింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1000 మెగావాట్ల విండ్ పవర్, 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ రాష్ట్రంలో 4 దశల్లో 10,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 2 వేలమందికి ఉపాధి కలగనుంది. అదే సమయంలో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లి పూడిమడక వద్ద కొత్తగా ఎనర్జీ పార్కు ఏర్పాటు కానుంది. రెండు విడతల్లో ఈ ప్రాజెక్టుకు 110 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అంటే 1,10వేల కోట్ల పెట్టుబడితో ఎన్టీపీసీ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా 61 వేల ఉద్యోగాలు రానున్నాయి. మరోవైపు విశాఖలోనే టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది.
రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీల్లో ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ తీర్మానం చేసింది. నెల్లూరు బ్యారేజికి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజ్‌గా పేరు మార్పుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. గ్రానైట్ కంపెనీలకు యూనిట్‌కు 2 రూపాయల చొప్పున విద్యుత్ రాయితీ ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Also read: Tuni Politics: యనమల కుటుంబంలో అసమ్మతి, వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్న యనమల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook