Rangareddy Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

Car Hits DCM Vehicle In Rangareddy: అతివేగం నలుగురు ప్రాణాలను బలిగొంది. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం మండలం తుమ్మనూరు గేట్ సమీపంలో షిఫ్ట్ కారును ఎదురుగా వేగంగా వస్తున్న డీసీఎం ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2023, 09:35 AM IST
  • మహేశ్వరం మండలం తుమ్మనూరు గేట్ సమీపంలో రోడ్డుప్రమాదం
  • షిఫ్ట్ కారును ఢీకొట్టిన డీసీఎం
  • ఘటన స్థలంలోనే నలుగురు దుర్మరణం
Rangareddy Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

Car Hits DCM Vehicle In Rangareddy: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మహేశ్వరం మండలం తుమ్మలూరు గేట్ సమీపంలో  డీసీఎం వాహనాన్ని షిఫ్ట్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందిచడంతో వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తి అయిన అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. 

మృతులను నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి వారిగా గుర్తించారు. కేశవులు(35), శ్రీనివాసులు (30), యాదయ్య (34), రామస్వామి(32) హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వంట చేసేందుకు వెళ్లారని.. అనంతరం తిరిగి సొంతూరుకు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 

కాగా.. రంగారెడ్డి నాలుగు రోజుల క్రితం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మాడ్గుల మండలంలో ఓ ఆటోను పత్తి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టగా.. ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను కలకొండ పంచాయతీ సండ్రలగడ్డ తండాకు చెందిన వారిగా గుర్తించారు. నెనావత్‌ పత్యానాయక్‌ (40), నెనావత్‌ అభిరాం (2), వర్త్యావత్‌ శాంతి(45) మృతిచెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

Also Read: CM Jagan Mohan Reddy: ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్‌లోకి డబ్బులు జమ.. ఒక్కొక్కరికి రూ.లక్ష  

Also Read: Loan Interest Rate: ఈ బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. లోన్లపై వడ్డీ రేట్లు పెంపు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News