Smriti Mandhana Injury: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ శుక్రవారం నుంచి ఆరంభంకానుంది. భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌ని ఫిబ్రవరి 12న పాకిస్థాన్ మహిళల జట్టుతో ఆడనుంది. అయితే ఈ కీలక పోరుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ స్టార్ ఓపెనర్ వేలి గాయమైంది. పాక్‌తో మ్యాచ్‌కు స్మృతి దూరమైతే బ్యాటింగ్ ఆర్డర్‌పై చాలా ఒత్తిడి ఉంటుంది. ఫిబ్రవరి 8న బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా స్మృతి ఆడలేదు. ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్మృతికి చేతి వేలికి గాయమైంది. ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు.
అదేవిధంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడేది కూడా అనుమానంగా మారింది. సఫారీతో జరిగిన ముక్కోణపు సిరీస్ చివరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ భుజానికి గాయమైంది. ఆమె ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేదని సమాచారం. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు పాక్‌తో మ్యాచ్ నుంచి తప్పుకుంటే టీమిండియాకు కష్టాలు తప్పవు. 'స్మృతి మంధాన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడింది. ఆమె ప్రపంచకప్‌కు దూరమైందని చెప్పలేం. కానీ పాకిస్థాన్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది' అని ఐసీసీ వర్గాలు పీటీఐకి తెలిపాయి.
Vice-captain Smriti Mandhana suffers finger injury, likely to miss India's women's #T20WorldCup opener against Pakistan
— Press Trust of India (@PTI_News) February 10, 2023
ఈ టీ20 ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు గ్రూప్-బిలో ఉంది. ఫిబ్రవరి 12న పాక్ మహిళల జట్టుతో వరల్డ్ కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 18న ఇంగ్లండ్‌తో, ఫిబ్రవరి 20న ఐర్లాండ్ మహిళల జట్టుతో తమ గ్రూప్‌లోని చివరి మ్యాచ్ ఆడనుంది భారత్.
ఇటీవలె అండర్-19 వరల్డ్ కప్‌ను భారత మహిళల జట్టు గెలుచుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసింది. అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని మొదటిసారి కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఏడు వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. దీంతో ఈసారి సీనియర్ టీ20 వరల్డ్ కప్‌ను కూడా టీమిండియా సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Hindenburg vs Adani: సర్వత్రా ఉత్కంఠ.. అదానీ వ్యవహారంపై నేడు సుప్రీంలో విచారణ
Also Read: North Korea Military Parade: ఉత్తర కొరియాలో భారీ పరేడ్.. తొలిసారి అతిపెద్ద క్షిపణులు ప్రదర్శన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook