How to Apply for Tatkal Passport : న్యూఢిల్లీ: కారణం ఏదైనా మీరు అతి త్వరలో విదేశాలకు వెళ్లాల్సిన పని పడిందా ? కానీ మీకు పాస్‌పోర్ట్ లేదా ? అయ్యో ఇప్పుడు ఎలా అని కంగారుపడుతున్నారా ? టెన్షన్ పడకండి. ఇలాంటి అత్యవసర సమయంలో పాస్‌పోర్ట్ లేని వారి చింత తీర్చడానికే తత్కాల్ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్ అనే ఆప్షన్ ఉంది. సాధారణంగా పాస్‌పోర్ట్ పొందాలంటే దరఖాస్తు ప్రక్రియ మొదలుకుని పోలీసు వెరిఫికేషన్ వరకు ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి ఉంటుంది. కానీ తత్కాల్ పాస్‌పోర్టు విషయంలో అలా కాదు. సాధారణ పాస్ పోర్టుతో పోల్చితే.. తత్కాల్ పాస్‌పోర్ట్ ఇంకాస్త సులభంగానే పొందే అవకాశం ఉంది.
పాస్‌పోర్ట్ లేని సమయంలో అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సిన పని పడిన వారికి తత్కాల్ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ఇది తత్కాల్ సేవ కావడంతో రూ. 2000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రెగ్యులర్ పాస్‌పోర్ట్ వలె కాకుండా, తత్కాల్ పాస్‌పోర్ట్ విషయంలో పాస్‌పోర్ట్ జారీ అయిన తర్వాత పోలీసు వెరిఫికేషన్ జరుగుతుంది.
తత్కాల్ పాస్‌పోర్ట్ ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ముందుగా పాస్‌పోర్ట్ అధికారిక వెబ్సైట్ www.passportindia.gov.in ను సందర్శించండి
డిపార్ట్మెంట్ వెబ్సైట్లో మీ పేరు వివరాలు నమోదు చేసుకోండి.
తత్కాల్ ఆప్షన్ ఎంచుకోండి.
వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోండి
ఆ ఫారంలో అడిగిన వివరాలను నమోదు చేయండి.
దరఖాస్తు ఫారంను సబ్మిట్ చేయండి.
చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసి రశీదు ప్రింటౌట్ తీసుకోండి.
మీకు సమీపంలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోండి. మిగతా ప్రక్రియను పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో సంబంధిత అధికారులు పూర్తి చేస్తారు.
ఇది కూడా చదవండి : Luxurious Trains: ఈ రైళ్లలో ప్రయాణిస్తే ఆ లగ్జరీనే వేరు.. మీరెప్పుడైనా ట్రై చేశారా ?
ఇది కూడా చదవండి : Samsung Galaxy S23 Ultra: ఈ 200MP కెమెరా సూపర్ స్మార్ట్ ఫోన్‌పై రూ. 8వేల డిస్కౌంట్
ఇది కూడా చదవండి : Okaya Faast F3 EV Scooter: మార్కెట్లోకి మరో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook