సాధారణంగా ముఖంపై వృద్ధాప్య లక్షణాలనేవి నిర్ణీత వయస్సు దాటాక వస్తుంటాయి. కానీ చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఇటీవలి కాలంలో 40 ఏళ్లకే వృద్ధాప్య ఛాయలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి. ఎందుకీ పరిస్థితి, ఆ అలవాట్లు ఏంటి..
జీవనశైలిలో వచ్చే మార్పులు, తినే ఆహారం కారణంగా ముఖంపై 40 ఏళ్లకే ముడతలు ఏర్పడుతున్నాయి. చర్మం నిగారింపు కోల్పోతోంది. ఫలితంగా వృద్ధాప్యం ముందే వచ్చినట్టు కన్పిస్తోంది. ఇటీవలి కాలంలో 40 ఏళ్ల వయస్సుకే ఈ సమస్య రావడం సాధారణమైంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ముందు జీవనశైలిలో మార్పులు అవసరం. ఆహారపు అలవాట్లు కూడా మారాల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
ఒత్తిడి
జీవితంలో ఉరుకులు పరుగుల కారణంగా ఒత్తిడి, ఆందోళన ఎక్కువౌతోంది. దాదాపు ప్రతి ఒక్కరూ ఒత్తిడి లోనవుతున్నారు. ఒత్తిడి పరిమితి దాటితే దుష్పరిణామాలు ఎదురౌతాయి. అతిగా ఆలోచించడం, ఎక్కువగా టెన్షన్ పడటం మంచిది కాదు. దీని ప్రభావం ముఖంపై స్పష్టంగా కన్పిస్తుంది. అందుకే ఒత్తిడిని దూరం చేయడం చాలా అవసరం.
తగినంత నిద్ర
ఇటీవలి బిజీ లైఫ్స్టైల్లో పని ఒత్తిడి పెరిగి..తగినంత నిద్ర ఉండటం లేదు. రోజుకు కావల్సిన ఆరోగ్యకరమైన 7-8 గంటల రాత్రి నిద్ర దూరమైపోతోంది. దాంతో ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. నిద్ర సరిగ్గా లేకపోవడంతో ముఖంపై ముడతలు, కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి. ఇవి వృద్ధాప్య ఛాయల్లో ముఖ్యమైనవి.
ఆరోగ్యకరమైన ఆహారం
ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఆహారపు అలవాట్లు మారిపోయాయి. వేళ కాని వేళల్లో తినడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎక్కువైంది. డైట్ సరిగ్గా లేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. చర్మానికి హాని కలుగుతోంది. ఆయిల్, ఫ్రైడ్ ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏజియింగ్ సమస్య ఎదురౌతోంది. హెల్తీ డైట్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
స్మోకింగ్
నికోటిన్ అనేది చర్మంలో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. నికోటిన్ కారణంగా చర్మానికి తగిన పోషకాలు, ఆక్సిజన్ అందదు. ఫలితంగా మీ అందంపై దుష్ప్రభావం పడుతుంది.
Also read: Valentine History: వాలెంటైన్ డే చరిత్ర తెలియకే ఆందోళనలు, అసలు సంగతేంటంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook