RCB buy Smriti Mandhana for 3.4 Crores: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) త్వరలోనే జరగనున్న విషయం తెలిసిందే. తొలిసారి నిర్మహించనున్న డబ్ల్యూపీఎల్ 2023 వేలం నేడు జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మొదలైన ఈ వేలం.. స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. మహిళా లీగ్ వేలం మల్లిక సాగర్ నేతృత్వంలో జరుగుతోంది. 90 బెర్త్‌ల కోసం 409 మంది మహిళా క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్ వేలం 2023లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన భారీ ధర పలికింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 3.4 కోట్లకు మంధానను కైవసం చేసుకుంది. టీమిండియా వైస్ కెప్టెన్ మంధాన కోసం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడ్డాయి. దాంతో వేలం హోరాహారిగా సాగింది. చివరకు మంధానను బెంగళూరు రూ.3.40 కోట్లకు దక్కించుకుంది.
టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ని ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది. హర్మన్‌ప్రీత్ కోసం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు రూ.1.80 కోట్లకు ఆమెను ముంబై సొంతం చేసుకుంది. నాలుగు జట్లు పోటీపడినా.. హర్మన్‌ప్రీత్‌కు భారీ ధర పలకలేదు. మంధాన కంటే సగం ధరకే అమ్ముడుపోయింది.
మొదటి సెట్‌లో వేలానికి వచ్చిన ప్లేయర్లు వీరే:
సోఫీ డివైన్ (న్యూజిలాండ్)
సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్)
ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా)
హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్)
స్మృతి మంధాన (భారత్)
హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్)
ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా)
Also Read: iPhone 14 Discounts: ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఏకంగా 42 వేల తగ్గింపు! లిమిటెడ్ పీరియడ్ ఆఫర్
Also Read: 7 Ball Over: మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో ఘోర తప్పిదం.. 7 బంతులు వేపించిన అంపైర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.