Navdeep Engagement News టాలీవుడ్ నటుడు, హీరో నవదీప్ ఇంకా స్టిల్ బ్యాచ్‌లర్ లైఫ్‌నే ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని అంటాడు. ఇంట్లో వాళ్లు పెళ్లి పెళ్లి అని గోల చేస్తుంటారని, కానీ తాను మాత్రం పట్టించుకోనని నవదీప్ చెబుతుంటాడు. కానీ తాజాగా నవదీప్ కూడా పెళ్లికి సిద్దమైనట్టుగా కనిపిస్తోంది. ఈసారి స్పెషల్ వాలెంటైన్స్ డే అంటూ ఓ అమ్మాయి సిగ్గుతో తన మొహాన్ని దాచుకుని, ఎంగేజ్మెంట్ రింగ్‌ను చూపిస్తున్న ఫోటోను షేర్ చేశాడు.
అంటే ఆ అమ్మాయిని నవదీప్ పెళ్లి చేసుకోబోతోన్నాడా?.. ఆమెతో ఎంగేజ్మెంట్ జరిగి ఉంటుందా? అందుకే ఇలా పోస్ట్ వేసి ఉంటాడా? అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కానీ ఆ అమ్మాయి పేరుని ఖుషీ అహుజా అని ట్యాగ్ చేశాడు. కానీ ఆ ట్యాగ్‌తో ఇన్ స్టాగ్రాంలో ఫోటోలు ఏమీ కూడా కనిపించడం లేదు. చూస్తుంటే జనాలను బక్రా చేసేందుకు అలా చేశాడా? అన్నట్టుగా కనిపిస్తోంది.
నవదీప్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నేనే రాజు నేనే మంత్రి, ధృవ సినిమాలతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు నవదీప్. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, నవదీప్ పాత్రలు క్లిక్ అవ్వడంతో మళ్లీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఇంత వరకు మళ్లీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయాడు.
లవ్ మౌళి అనే సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని, మళ్లీ తనకు గౌతమ్ ఎస్ ఎస్ సీ వంటి హిట్ ఇస్తుందని ఆ మధ్య నమ్మకంగా చెప్పాడు. ఇక నవదీప్‌కు బిగ్ బాస్ షో బాగా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఫస్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ మెప్పించాడు. చివరి వరకు నిలబడ్డాడు. ఇంత వరకు ది బెస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌గా నిలిచాడు నవదీప్.
Also Read: manchu Lakshmi at Varanasi : వాలెంటైన్స్ డే.. వారణాసిలో మంచు లక్ష్మీ.. ట్వీట్ వైరల్
Also Read: Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook