Kantara Releasing for Shivaratri: సాధారణంగా శివరాత్రి సమయంలో రాత్రి జాగరణ చేస్తూ ఉంటారు, కొంతమంది భక్తితో శివ నామస్మరణ చేస్తూ రాత్రంతా జాగారం చేస్తుంటే సినిమా ప్రేమికులు మాత్రం శివరాత్రి జాగరణ పేరుతో సినిమాలు చూస్తూ గడిపేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో శివరాత్రి పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే శివరాత్రికి ఒకే టికెట్ మీద మూడు సినిమాలను ప్రదర్శిస్తూ ఉంటారు.
సాధారణంగా గత ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన తెలుగు సినిమాలను తెలుగువారికి ఇతర భాషల సినిమాలను ఆయా భాషల వారికి ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే గత ఏడాది విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన కాంతార సినిమాని తెలుగు ప్రేక్షకుల కోసం మరోసారి తెలుగులో విడుదల చేయబోతున్నారని అంటున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా స్పెషల్ షోస్ వేస్తున్నారని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు ఈ మేరకు గీత సంస్థను అప్రోచ్ అవ్వగా గీతా సంస్థ కూడా శివరాత్రికి స్పెషల్ షోస్ వేసేందుకు అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది.
కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్గా నటించింది. కిషోర్, అచ్యుత్ వంటి వారు ఇతర కీలకపాత్రలో నటించిన ఈ సినిమా 2022 సంవత్సరానికి గాను భారీ బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. రక్షిత్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడ సహా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలై ఇప్పటివరకు 350 కి పైగా కోట్ల వర్షం కురిపించింది.
ప్రస్తుతానికి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉన్నా శివరాత్రి సందర్భంగా సినిమాని మాత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాలో భూతకోల అనే ఒక కర్ణాటక రాష్ట్ర ప్రజల దైవకళ ఉంటుంది. ఆ కళ అనేకమందికి నచ్చటంతో ప్రేక్షకులు ఆ సినిమాని రిపీటెడ్ గా చూశారు. ఈ నేపథ్యంలోనే ఇంత భారీ ఎత్తున కలెక్షన్లు కాబట్టి గత ఏడాదికి గాను సూపర్ హిట్ సినిమాల ఖాతాలో నిలిచింది. ఒకరకంగా ఇలా వేరే భాషల సినిమాలు తెలుగులో శివరాత్రికి రిలీజ్ చేయడం చాలా అరుదనే చెప్పాలి.
Also Read: Agni Nakshatram Glimpse: రానా చేతుల మీదుగా అగ్ని నక్షత్రం గ్లింప్స్.. అదరకోట్టేసిందిగా!
Also Read: Javed Khan Amrohi Died: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook