Jio Annual Prepaid Recharge Plan Rs 2999 has a validity of 388 days: ప్రముఖ టెలికాం దిగ్గజం 'రిలయన్స్ జియో' తమ యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. 28 డేస్, 56 డేస్, 84 డేస్ లాంటి ఎన్నో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. 28, 56, 84 రోజులకు ఓసారి రీఛార్జ్ చేసుకునే బదులుగా.. ఏడాది మొత్తం వచ్చేలా బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను జియో తీసుకొచ్చింది. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఉంటుంది. దాంతో మళ్లీ మళ్లీ రిఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. యాన్యువల్ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి అదనంగా పలు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 2999. ఈ యాన్యువల్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే.. 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు అదనంగా 23 రోజుల వ్యాలిడిటీ కూడా పొందొచ్చు. అంటే ఈ ప్లాన్‌లో మొత్తంగా 388 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. ఇక ఈ ప్లాన్‌లో రోజూ 2.5 జీబీ డేటాను వాడుకోవచ్చు. అంటే మొత్తంగా 365 రోజులకు 912.5 జీబీ డేటాను మీరు వాడుకోవచ్చు. అదనంగా మరో 87 జీబీ డేటా కూడా పొందుతారు. 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్నవారు ఈ డేటాను వాడుకోవచ్చు. ఈ డేటా వీడియో డౌన్‌లోడ్ మరియు వీడియో స్ట్రీమింగ్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రూ. 2999 రీఛార్జ్ ప్లాన్‌లో ప్రతిరోజు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. 388 రోజుల పాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఇక రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీగా వాడుకోవచ్చు. అంతేకాకుండా రూ. 2999 రీఛార్జ్ ప్లాన్‌లో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‍స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. ఈ ప్రయోజనాల కారణంగా ఈ ప్లాన్ ఏ కస్టమర్‌కైనా ఉత్తమ ఎంపికగా ఉండనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Best Jio Recharge Plan 2023: జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 365 కాదు 388 రోజుల వ్యాలిడిటీ! అదనంగా 87 జీబీ డేటా
జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్
365 కాదు 388 రోజుల వ్యాలిడిటీ
అదనంగా 87 జీబీ డేటా