NITI Aayog Next CEO: నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా తెలుగు అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అయ్యర్ ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెళ్లనున్నారు. హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి రాజేష్ ఖుల్లార్ స్థానంలో అయ్యర్ నియామకం కానున్నారు. 1988 బ్యాచ్ IAS అధికారి అయిన ఖుల్లార్ సెప్టెంబర్ 2020లో ప్రపంచ బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
నీతి ఆయోగ్‌లో అయ్యర్ స్థానంలో బాధ్యతలు తీసుకోనున్న బీవీఆర్ సుబ్రహ్మణ్యం 1987 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఈయన 2004-2008, 2012-2015 మధ్య ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ వద్ద కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యం జమ్మూ మరియు కాశ్మీర్ ప్రధాన కార్యదర్శిగా మరియు ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్ మరియు జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.
బీవీఆర్ సుబ్రహ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం. ఈయన తండ్రి ఒడిశాకు, తల్లి ఆంధ్రాకు చెందినవారు. సుబ్రహ్మణ్యం ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మెకానికల్ బ్రాంచ్ లో బీటెక్ చేశారు. తర్వాత ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అనంతరం లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా కూడా పొందారు. లాల్‌బహదూర్‌శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు.
Also Read: Project Cheetah: భారత్‌కు చేరిన మరో 12 చీతాలు.. కునో నేషనల్ పార్కులో విడిచిపెట్టిన సీఎం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook