SS Rajamouli Directed Second Films of Jr NTR- Ram Charan: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ వీరిద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారు. రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఇప్పటికే సూపర్ హిట్స్ సాధించిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలై చాలా కాలమే అయినా ఈ రోజుకి ఈ సినిమా గురించి చర్చ జరుగుతోందంటే ఆ సినిమా ఎంతగా ప్రేక్షకులను అల్లరించింది? అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది? అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మార్చి 12వ తేదీన జరగబోతున్న ఆస్కార్ అవార్డులో వేడుకలో ఈ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన నేపథ్యంలో ఆ సాంగ్ కి లైవ్ లో పర్ఫార్మ్ చేయడానికి కూడా రంగం సిద్ధమవుతోంది. ఒక పక్కన కీరవాణి అండ్ కో ఆడియోతో అలరించబోతూ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ విజువల్ గా ట్రీట్ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఒక ఆసక్తికరమైన పోలికను అభిమానులు తీసుకొస్తున్నారు. అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రామ్ చరణ్ గొప్ప అని రామ్ చరణ్ అభిమానులు వాదించుకుంటున్నారు.
ఆ సంగతి కాదు మనం ప్రస్తావించేది. అదేమంటే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో రెండో సినిమా రాజమౌళితో చేశాడు, మొదటి సినిమా నిన్ను చూడాలని అనే సినిమాతో హిట్టందుకున్న ఎన్టీఆర్ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకోవడమే కాక తనలో ఉన్న నటుడిని కూడా బయట పెట్టాడు. ఇక రామ్ చరణ్ విషయంలో కూడా దాదాపుగా ఇలాగే జరిగింది. ఏమిటంటే 2007వ సంవత్సరంలో చిరుత సినిమాతో రామ్ చరణ్ హీరోగా లాంచ్ అయ్యాడు.
మొదటి సినిమా పూరి జగన్నాథ్ తో చేసి రెండో సినిమానే ఆయన రాజమౌళితో చేశాడు. మగధీర అంటూ రాజమౌళి రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అప్పటి వరకు తెలుగు సినిమా ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టింది. అలా ఎన్టీఆర్ రెండో సినిమా రాజమౌళితో చేయగా రాంచరణ్ కూడా రెండవ సినిమా రాజమౌళితో చేశాడని, అలా ఎన్టీఆర్ రామ్ చరణ్ కెరియర్లు రెండో సినిమాతోనే కీలక మలుపు తీసుకున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ అంశం మీద మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి