గుడ్ గవర్నెన్స్‌లో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఇవే

గుడ్ గవర్నెన్స్‌లో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఇవే

Last Updated : Jul 23, 2018, 05:32 PM IST
గుడ్ గవర్నెన్స్‌లో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఇవే

దేశంలో మంచి పాలన అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానాన్ని, ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ స్థానాన్ని సంపాదించినట్లు ప్రజా వ్యవహారాల సూచిక 2018-పీఏసీ (పబ్లిక్ ఎఫైర్స్ ఇండెక్స్ 2018) వెల్లడించింది. కాగా దేశంలో మంచి పాలన అందిస్తున్న రాష్ట్రంగా కేరళ అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌ వరుసగా రెండు, నాలుగు, ఐదు స్థానాలు సాధించాయి. 2016 నుంచి కేరళ మొదటి స్థానంలో నిలవడం వరుసగా ఇది మూడోసారి.  మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మంచి పాలన అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో 9వ స్థానంలో నిలిచింది.

కర్ణాటకకు చెందిన ప్రజా వ్యవహారాల కేంద్రం (పీఏసీ) శనివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ  జాబితాను విడుదల చేసింది. ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త శామ్యూల్‌ పాల్‌ 1994లో ఈ సంస్థను స్థాపించారు. ఆయా రాష్ట్రాల్లో సాంఘిక, ఆర్థికాభివృద్ధిని గణాంకాల ఆధారంగా తీసుకుని ఈ ర్యాంకులు కేటాయిస్తోంది పీఏసీ. తాజా నివేదిక ప్రకారం కేరళ అగ్రస్థానం నిలువగా.. మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్‌ చివరి స్థానాల్లో నిలిచాయి. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటే దీనికి కారణం అని పీఏసీ తెలిపింది.

రెండు కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు

పీఏసీ నివేదిక ప్రకారం మంచి పాలన అందిస్తున్న చిన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత గోవా, మిజోరం, సిక్కిం, త్రిపుర స్థానాలను దక్కించుకున్నాయి. నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ జాబితాలో చివరి స్థానాల్లో నిలిచాయి. భారతదేశంలో జనాభా పెరుగుతోందని, భవిష్యత్‌ కాలంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి అభివృద్ధి చెందాల్సి అవసరం ఉందని పీఎస్‌సీ చైర్మన్‌ కె.కస్తూరిరంగన్‌ పేర్కొన్నారు. పిల్లలకు సుఖవంతమైన పాలన అందించిన రాష్ట్రాల జాబితాను ఈ ఏడాది కొత్తగా చేర్చినట్లు.. అందులో కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాలు టాప్ త్రీలో నిలిచాయన్నారు.

Trending News