Swati Maliwal: మా నాన్న లైంగికంగా వేధించాడు.. మంచం కింద దాక్కున్నా.. డీసీడబ్ల్యూ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

DCW Chief Swati Maliwal Sexually Assaulted: తన చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపులను డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ బయటపెట్టారు. తన తండ్రి లైంగికంగా వేధించాడని.. భయంతో మంచం కింద దాక్కుకున్నానంటూ గుర్తు చేసుకున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2023, 05:41 PM IST
Swati Maliwal: మా నాన్న లైంగికంగా వేధించాడు.. మంచం కింద దాక్కున్నా.. డీసీడబ్ల్యూ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

DCW Chief Swati Maliwal Sexually Assaulted: తన తండ్రి తనను లైంగికంగా వేధించాడంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో జరిగిన చీకటి కోణాన్ని ఆమె బయపెట్టారు. 'నా చిన్నప్పుడు మా నాన్న లైంగికంగా వేధించేవాడు. నన్ను కొట్టేవాడు. నేను భయపడి మంచం కింద దాక్కునేదాన్ని. మా నాన్న ఇంటికి వస్తుంటే చాలా భయంగా ఉండేది. నేను చిన్న పిల్లను కావడంతో ఏం చేయలేకపోయేదాన్ని. నేను చాలాసార్లు మంచం కింద దాక్కుని ఆడవాళ్లకు హక్కులు ఎలా పొందాలో రాత్రంతా ఆలోచించేదాన్ని. బాలికలు, మహిళలపై దోపిడీ చేసే వారికి గుణపాఠం చెప్పాలనుకున్నా..' అంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీ మహిళా కమిషన్ నిర్వహించిన డీసీడబ్ల్యూ అవార్డుల కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

తనకు ఇంకా బాగా గుర్తుందని.. తన తండ్రి జుట్టును పట్టుకుని.. తన తల గోడకు బలంగా కొట్టేవాడని చెప్పారు. ఒక్కొసారి రక్తం కూడా వచ్చేదని అన్నారు. తన తల్లి, అత్త, కుటుంబసభ్యుల సాయంతో తన తండ్రి నుంచి తప్పించుకున్నానని తెలిపారు. ఒక వ్యక్తి ఇలాంటి దారుణాలకు గురైనప్పుడు మాత్రమే.. ఇతరుల బాధను అర్థం చేసుకోగలర తాను నమ్ముతానని పేర్కొన్నారు. అప్పుడే వారిలో ఉన్న వారిలో శక్తి బయటకు వస్తుందని.. మొత్తం వ్యవస్థను కదిలించగలరని అన్నారు. బహుశా తనకు అదే జరిగిందని చెప్పారు. 

 

ఈ సంఘటన తన చిన్నతనంలో జరిగిందని స్వాతి మలివాల్ తెలిపారు. తాను 4వ తరగతి చదివే వరకు మా నాన్న దగ్గరే ఉన్నానని.. అప్పటివరకు ఇలా చాలా సార్లు ఇలా జరిగిందన్నారు.  స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2021లో స్వాతికి వరుసగా మూడోసారి డీసీడబ్ల్యూ బాధ్యతలు అప్పగించారు. ఆమె 2015 నుంచి ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు.

Also Read: MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఏంటి..? అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

Also Read: Meta Layoffs: మరోసారి షాక్ ఇవ్వనున్న మెటా.. 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News