ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రియాక్షన్‌పై సింగర్ అద్నాన్ సమీ మరోసారి నోరుజారాడు. తెలుగు ఖ్యాతి రెపరెపలాడుతుందన్న జగన్ వ్యాఖ్యను సమీ తప్పుబట్టాడు.
సింగర్ అద్నాన్ సమీకు ఈ మధ్యకాలంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్ప మరెవరూ కన్పించడం లేనట్టుంది. ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై తెలుగువాడిగా ప్రతి ఒక్కరూ గర్వించాల్సిందే. ఆ తెలుగు గౌరవం చాటుకోవల్సిందే. దాదాపు తెలుగు జాతి ప్రముఖులంతా ఇదే రీతిలో స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇలానే స్పందించారు. తెలుగు పాటకు ఆస్కార్ రావడం చాలా గర్వంగా ఉందని..తెలుగు పతాకం రెపరెపలాడుతోందని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని అవకాశాల కోసం భారతీయుడిగా మారాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్నాన్ సమీకు తప్పుగా అన్పించాయట.
గతంలో కూడా నాటు నాటు పాటకు గోల్టెన్ గ్లోబ్ అవార్జు వచ్చిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యల్ని అద్నాన్ సమీ తప్పుబట్టాడు. మనం ముందు భారతీయులమని..తెలుగు అని చెప్పి మిగిలిన భారతదేశంతో వేరు చేయవద్దని సూచిస్తూ జగన్‌పై కామెంట్లు చేశాడు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి. ఈసారి ఏకంగా కామెంట్లు తీవ్రం చేశాడు. ముఖ్యమంత్రి జగన్‌ది నూతిలో కప్ప మనస్తత్వమని అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు. వరుసగా రెండుసార్లు ఆర్ఆర్ఆర్ విషయంలో జగన్‌ను టార్గెట్ చేశాడు అద్నాన్ సమీ.
What a regional minded frog in a pond who can’t think about the ocean because it’s beyond his tiny nose!! Shame on you for creating regional divides & unable to embrace or preach national pride!
Jai HIND!!🇮🇳 https://t.co/dodc3f0bfL— Adnan Sami (@AdnanSamiLive) March 13, 2023
అవకాశాల కోసం ప్రాచుర్యం కోసం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై విమర్శలు చేయడం మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నెటిజన్లు మండిపడుతున్నారు. హద్లులు తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు. అద్నాన్ సమీ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోవల్సివస్తుందంటున్నారు. ఇంతకుముందు కూడా మరో సందర్భంలో ఉత్తరాది, దక్షిణాది మధ్య భాష నేర్చుకునే విషయంలో ఉన్న అంతరాన్ని ట్వీట్ చేసి విమర్శల పాలయ్యాడు. దక్షిణాది ప్రజలు హిందీ నేర్చుకుంటారని..కానీ ఉత్తరాది ప్రజలు దక్షిణాది భాషలు నేర్చుకోరని వేరుచేస్తూ మట్లాడి నెటిజన్లతో చీవాట్లు తిన్నాడు. అనవసర విషయాల్లో కలగజేసుకుని ప్రాచుర్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఆ రోజే లాస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook