Upcoming 7 Seater Cars In India 2023: ఇండియాలో ఎక్కువగా అమ్ముడయ్యే కాంపాక్ట్ MPV కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా ఒకటి. సరసమైన ధర, ఇరుకుగా లేకుండా విశాలమైన ఇంటీరియర్స్, మైలేజ్ వంటి ఫీచర్స్ మారుతి సుజుకి ఎర్టిగాను ఎంపీవీ మార్కెట్లో లీడర్ని చేశాయి. మారుతి ఎర్టిగా ప్రారంభ ధర రూ.8.35 లక్షల నుంచి మొదలై టాప్ మోడల్ కార్లకు రూ.12.79 లక్షల వరకు ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన 7 సీటర్ కార్ల జాబితాలో టాప్ ర్యాంక్ కూడా సొంతం చేసుకుంది.
ఇదంతా ఇప్పటివరకు మారుతి సుజుకి సాగించిన తిరుగులేని ప్రస్థానం. కానీ ఇకపై ఎర్టిగా బిజినెస్ అంత ఈజీ కాదంటున్నారు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే ఇదే మారుతి సుజుకి ఎర్టిగా ధరల శ్రేణిలో మరో మూడు కొత్త MPV కార్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఆ మూడు కార్ల రాక ఎర్టిగా బిజినెస్ పై ప్రభావం చూపించే అవకాశం మెండుగా ఉందనేది వారి అభిప్రాయం. ఇంతకీ 7 సీటర్ కేటగిరిలో కొత్తగా మార్కెట్లోకి వస్తోన్న ఆ మూడు కార్లు ఏవి.. అవి ఎర్టిగాకు ఎందుకు పోటీ అవుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
1. సిట్రోయెన్ 7 సీటర్ MPV కారు:
ఫ్రాన్స్‌కి చెందిన ఆటోమొబైల్ కంపెనీ సిట్రోయెన్ C3 హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా కొత్త MPV వాహనాన్ని తీసుకొస్తోంది. ఇదే సిట్రోయెన్ కంపెనీ 5 సీటర్ కారును కూడా లాంచ్ చేస్తోంది. ఇది కాంపాక్ట్ SUV కార్లకి పోటీ ఇవ్వనుందని సిట్రోయెన్ భావిస్తోంది. కొత్త సిట్రోయెన్ 7-సీటర్ MPV కారు పేరు C3 ఎయిర్‌క్రాస్ అనే పేరుతో ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కొత్త 7 సీటర్ కారు బేస్ వేరియంట్ మారుతి సుజుకి ఎర్టిగాకు పోటీగా రానుండగా.. టాప్ వేరియంట్ కార్లు కియా కారెన్స్‌కి పోటీ ఇవ్వనున్నాయని సమాచారం. 1.2L, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందనున్న ఈ కారు మారుతి సుజుకి ఎర్టిగాకు గట్టి పోటీ ఇవ్వనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.
2. నిస్సాన్ 7 సీటర్ MPV కారు:
నిస్సాన్ ఇండియా ఆటోమొబైల్ కంపెనీ 2 కొత్త SUV కార్లతో పాటు 1 కొత్త MPV కారుని కూడా లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. నిస్సాన్ 7 సీటర్ MPV కారు చూడ్డానికి రెనాల్ట్ 7 సీటర్ ట్రైబర్ కారుని పోలి ఉంటుందని తెలుస్తోంది. 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో రూపొందుతున్న ఈ కారు మాన్యువల్ గేర్ బాక్సు, CVT గేర్‌బాక్స్ వెర్షన్స్ లో రానుంది. నిస్సాన్ మాగ్నైట్ ఫీచర్స్ కూడా కొన్ని ఇందులో ఉండే అవకాశాలు ఉన్నాయి.
3. టయోటా రూమియన్ MPV కారు:
టయోటా 2 సంవత్సరాల క్రితమే ఇండియన్ మార్కెట్ కోసం 'రూమియన్' అనే పేరు ట్రేడ్‌మార్క్ చేయించి పెట్టింది. 2023లో ఈ టయోటా రూమియన్ కారు లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇది మారుతి సుజుకి ఎర్టిగా కారు రీ-బ్యాడ్జ్ వెర్షన్‌ని పోలి ఉంటుందని టాక్. టయోటా రూమియన్ MPV కారు ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్ విభిన్నమైన స్టైల్లో ఉండే అవకాశం ఉంది. టయోటా కాంపాక్ట్ MPV 1.5 లీటర్, 4 సిలిండర్ డ్యూయల్‌జెట్ ఇంజన్‌తో రూపొందింది. ఈ కారు కూడా మారుతి సుజుకి ఎర్టిగా కారుకు పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ మూడు కార్ల రాక మారుతి సుజుకి ఎర్టిగా కారు సేల్స్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : Tata Micro SUV @ Rs 6Lakhs: హ్యుండయ్ క్రెటా, వెన్యూలను తలదన్నే టాటా మోటార్స్ ఎస్యూవీ, ధర కేవలం రూ.6 లక్షలే!
ఇది కూడా చదవండి : 3 Lakhs Discount Cars: మార్చి బొనాంజా.. ఈ 5 కార్లపై 3 లక్షల వరకు తగ్గింపు! బెస్ట్ ఎస్యూవీ కొనడానికి ఉత్తమ సమయం ఇదే
ఇది కూడా చదవండి : Best Hatchback Cars: బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే..రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook