Suresh Raina Gives hint on CSK Captain MS Dhoni IPL Future: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎప్పుడో ప్రాక్టీస్‌ను కూడా ప్రారంభించాడు. చెన్నై చిదంబరం స్టేడియంలో రోజూ సాధన చేస్తున్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఈ సీజన్‌తో ఐపీఎల్‌కూ గుడ్‌బై చెప్పేస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా 'మిస్టర్ ఐపీఎల్' సురేశ్ రైనా స్పందించాడు.
ప్రస్తుతం సురేష్ రైనా లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ)లో ఇండియా మహారాజాస్ తరపున ఆడుతున్నాడు. తాజాగా వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో మాజీ చెన్నై స్టార్ రైనా మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనీ తప్పకుండా ఐపీఎల్ 2024లో ఆడతాడని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2023లో మహీ ఫామ్ మరియు ఫిట్‌నెస్‌పై వచ్చే సీజన్ ఆడేది లేనిది ఆధారపడి ఉంటుందని రైనా వెల్లడించాడు. భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఐపీఎల్ గత సీజన్ నుంచి రిటైరయ్యాడు.
'ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2024లోనూ ఆడాలని నేను కోరుకుంటున్నా. అయితే మహీ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. బ్యాటింగ్ బాగానే చేస్తున్నాడు. ఫిట్‌నెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఏడాది ధోనీ ప్రదర్శనపైనే వచ్చే సీజన్ ఆడాలా? వద్దా? అనే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇక సంవత్సరం నుంచి ఆడని ధోనీ, అంబటి రాయుడుకు సవాల్ తప్పదు' అని సురేశ్ రైనా చెప్పాడు. రైనా, ధోనీ కలిసి చాలా ఏళ్లుగా చెన్నై తరఫున ఆడిన విషయం తెలిసిందే.
'చెన్నై జట్టు ఇప్పటికీ చాలా బలంగా ఉంది. చాలా మంది యువ ఆటగాళ్లు చెన్నైలో నిరూపించుకుంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్, దీపక్ చహర్.. ఇలా అనుభజ్ఞులు, యువతతో కూడిన జట్టు ఉంది. అయితే వారు ఎలా ఆడతారో చూడాలి. ఇక ఎంఎస్ ధోనీ, నేను టచ్‌లోనే ఉంటాం. ఇప్పుడు మహీ కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెన్నై సోషల్ మీడియాలోని వీడియోలను చూస్తే అర్ధమవుతుంది. నెట్స్‌లో అతడు భారీ షాట్లను కొట్టేస్తున్నాడు. ఇలానే మ్యాచ్‌లోనూ ఆడితే విజయాలు అవే వస్తాయి' అని రైనా చెప్పుకొచ్చాడు.
Also Read: Top SUVs Under 10 Lakhs: 10 లక్షల లోపు టాప్ ఎస్‌యూవీలు.. పంచ్, నెక్సాన్, బ్రెజ్జాతో సహా థార్ కూడా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.