IND Vs Aus 1st ODI: ఆసీస్‌తో తొలి వన్డే నేడే.. అందరి కళ్లు ఆ ప్లేయర్‌పైనే..!

Ind Playing 11 Vs Aus: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ శుక్రవారం ఆరంభంకానుంది. మరికాసేపట్లో రెండు జట్లు వాంఖడేలో తలపడనున్నాయి. రోహిత్ శర్మ మొదటి మ్యాచ్‌కు దూరమవ్వడంతో హార్ధిక్ పాండ్యా తొలిసారి వన్డే జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2023, 09:13 AM IST
IND Vs Aus 1st ODI: ఆసీస్‌తో తొలి వన్డే నేడే.. అందరి కళ్లు ఆ ప్లేయర్‌పైనే..!

Ind Playing 11 Vs Aus: బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు ఆసీస్‌తో వన్డే సిరీస్‌ కోసం రెడీ అవుతోంది. శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తొలి వన్డేలో తలపడనుంది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గైర్హాజరీతో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అటు ప్యాట్ కమిన్స్ వన్డే సిరీస్‌కు దూరమవ్వడంతో స్టీవ్ స్మిత్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. చివరి రెండు టెస్టుల్లో పుంజుకున్న ఆసీస్.. వన్డే సిరీస్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైంది. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుంది..? ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి చోటు దక్కుతుంది..?
 
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఆడడం లేదు. ఈ మ్యాచ్‌కు శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్‌ కిషన్ ఓపెనింగ్‌ చేయనున్నాడు. ముఖ్యంగా గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. చివరి టెస్టులోనూ సెంచరీతో చెలరేగాడు. క్షణాల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పడం ఇషాన్ కిషన్ ప్రత్యేకత. ఈ ఇద్దరు యంగ్ బ్యాట్స్‌మెన్ జోడి ఆసక్తికరంగా ఉండనుంది. విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో రానున్నాడు. 

వన్డేల్లో తిరిగి పుంజుకున్న కోహ్లీ.. గత ఆరు వన్డేల్లో 338 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ దూరమవ్వడంతో సీనియర్ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీపై మరింత బాధ్యత పెరిగింది. కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. నాలుగో స్థానంలో ఆడనున్నాడు. సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగానే ఉంది. టీ20ల్లో అదరగొడుతున్న సూర్య.. వన్డేలకు వచ్చేసరికి తేలిపోతున్నాడు. ఈ సిరీస్‌ కీలకంగా మారనుంది. 

గాయం నుంచి కోలుకుని టెస్టుల్లో పురాగమనం చేసిన రవీంద్ర జడేజా.. వన్డేల్లోనూ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన జడ్డూ భాయ్.. వన్డేల్లోనూ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. మరో స్పిన్నర్ కోసం గట్టి పోటీ నెలకొంది. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లలో కెప్టెన్ ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి. స్పిన్ ఆల్‌రౌండర్‌గా జడేజా ఉండడంతో కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి అవకాశం ఉంది. శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.  

ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1 గంటకు మ్యాచ్ ఆరంభంకానుంది. స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ కానుంది. 

ఆసీస్‌తో తొలి వన్డేకు టీమిండియా తుది జట్టు (అంచనా): ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు తెర.. డీఏ పెంపుపై నేడే ప్రకటన  

Also Read: Loan Costly: కస్టమర్లకు షాకిచ్చిన మరో బ్యాంక్.. ఈఎంఐలపై భారీ మోత

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News