India Vs Australia Playing 11: భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరగనుంది. మొదటి మ్యాచ్ గెలిచిన భారత్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో టీమిండియా రంగంలోకి దిగనుంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి కంగారూ జట్టుది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. ఆస్ట్రేలియా కూడా తుది జట్టులో రెండు మార్పులు చేసింది.
ఇషాన్ కిషన్ స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్ ప్లేస్ అక్షర్ పటేలో తుది జట్టులోకి వచ్చారు. ఆసీస్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఫిట్‌గా లేకపోవడంతో రెండో వన్డేకు దూరమయ్యాడు. మాక్స్‌వెల్ స్థానంలో ఎల్లిస్ జట్టులోకి రాగా.. ఇంగ్లిస్ స్థానంలో అలెక్స్ కార్వీని తీసుకున్నారు.
🚨 Here's #TeamIndia's Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/dzoJxTOHiK#INDvAUS | @mastercardindia pic.twitter.com/UiyxF37ZH6
— BCCI (@BCCI) March 19, 2023
మొదటి వన్డేలో టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమవ్వడం ఆందోళనకు గురిచేసింది. కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి చేరడంతో బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. గిల్, విరాట్ కోహ్లీ తమ బ్యాట్లకు పని చెప్తే.. ఇక భారత్‌కు తిరుగుండదు. సూర్యకుమార్ యాదవ్ ఈ వన్డేలో అయినా భారీ ఇన్నింగ్స్ ఆడతాడో లేదో చూడాలి.
మరోవైపు ఆసీసీ రెండో వన్డేకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండడంతో టాస్ గెలిచిన కెప్టెన్ స్మిత్.. మరో ఆలోచన లేకుండా ఫీల్డిండ్ ఎంచుకున్నాడు. పిచ్‌పై తేమను తమ పేసర్లను సద్వినియోగం చేసుకుంటారని స్మిత్ నమ్మకం. చూడాలి మరి ఏమవులతుందో..!
తుది జట్లు ఇలా..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
Also Read: Ravindra Jadeja: ఎవరికీ తెలియని సీక్రెట్ బయటపెట్టిన రవీంద్ర జడేజా.. నిజమేనా..!
Also Read: AP Weather Report: నేడు ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook