Ramadan 2023: రంజాన్ ఉపవాసాలు ఎప్పట్నించి, సహరి, దేశంలోని వివిధ నగరాల్లో సహరి, ఇఫ్తార్ వేళలు ఇలా

Ramadan 2023: రంజాన్ పవిత్ర నెల ప్రారంభం కానుంది. సౌదీ దేశాల్లో రేపట్నించి ఉపవాసదీక్షలు ప్రారంభం కానుండగా ఇండియాలో రేపు లేదా ఎల్లుండ చంద్ర దర్శనాన్ని బట్టి ప్రారంభం కావచ్చు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2023, 01:06 PM IST
Ramadan 2023: రంజాన్ ఉపవాసాలు ఎప్పట్నించి, సహరి, దేశంలోని వివిధ నగరాల్లో సహరి, ఇఫ్తార్ వేళలు ఇలా

Ramadan 2023: ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ 9వ నెల. ఇది చాలా పవిత్రమైంది. పుణ్యాలు మూటగట్టుకునే నెల. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల కావడంతో అత్యంత ప్రాధాన్యత, మహత్యం కలిగి ఉంటుంది. నెలంతా ఉపవాసాలు ఆచరిస్తూ..అల్లాహ్ ప్రార్ధనల్లో గడుపుతారు. 

ఇండియాలో ఇవాళ చంద్ర దర్శనమైతే రేపు అంటే గురువారం నుంచి ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. లేకపోతే శుక్రవారం నుంచి విధిగా ఉపవాసాలు మొదలౌతాయి.  రంజాన్ నెలలో చేసే ప్రతిపనిలో పుణ్యం వస్తుంది. ఎక్కువ సమయం అల్లాహ్ ఆరాధనలో గడపాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా రంజాన్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముస్లిం ప్రజానీకం నెలంతా ఉవవాసాలుండేందుకు సిద్ధమౌతున్నారు. రోజంతా సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకూ ఉపవాసాలు ఆచరిస్తారు. 

సాధారణంగా సౌదీ దేశాల్లో రంజాన్ ప్రారంభమైన ఒక రోజు తరువాత ఇండియాలో రంజాన్ మొదలవుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలకు 29 లేదా 30 రోజులుంటాయి. చంద్ర దర్శనాన్ని బట్టి ఏ నెలకు ఎన్ని రోజులనేది నిర్ణయమౌతుంది. అరేబియా దేశాల్లో షాబాన్ నెల 30 రోజులు ఇవాళ్టితో పూర్తి కానున్నాయి. అంటే రేపట్నించి ఉపవాసాలు అక్కడ. కానీ ఇండియాలో షాబాన్ నెల 29 రోజులు ఇవాళ్టితో పూర్తి కానున్నాయి. అందుకే ఇవాళ ఇండియాలో చంద్ర దర్శనమైతే రేపట్నించి ఉపవాసాలు లేదా శుక్రవారం నుంచి విధింగా మొదలౌతాయి.

ఉపవాసాలుండేటప్పుడు ఉదయం తెల్లవారుజామున లేచి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటారు. దీనినే సహరి అంటారు. ఇక సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో దీక్ష విడుస్తారు. దీనిని ఇఫ్తార్ అంటారు. అయితే సహరి, ఇఫ్తార్ రెండింటికీ ఆయా దేశాలు, నగరాల కాలమానం ప్రకారం వేర్వేరుగా నిమిషాల తేడాలో నిర్ణీత సమయం ఉంటుంది. ఏ నగరాల్లో సహరి, ఇఫ్తార్ ఎప్పుడు ఉంటుందో తెలుసుకుందాం..

విశాఖపట్నంలో సహరి ఉదయం 4.45 గంటలకు కాగా ఇఫ్తార్ సాయంత్రం 6. 13 గంటలకు ఉంటుంది. రాజమండ్రిలో సహరి ఉదయం 4.51 గంటలకు , ఇఫ్తార్ సాయంత్రం 6.15 గంటలకు ఉంటుంది. ఇక విజయవాడలో సహరి ఉదయం 4.54 గంటలకు కాగా, ఇఫ్తార్ సాయంత్ర 6.17 గంటలకు ఉంటుంది. అదే తిరుపతిలో సహరి ఉదయం 4.55 గంటలకైతే, ఇఫ్తార్ సాయంత్రం 6. 6.20 గంటలకు ఉంటుంది. కర్నూలులో సహరి ఉదయం 4.55 గంటలకు కాగా ఇఫ్తార్ సాయంత్రం 6.22 గంటలకు ఉంటుంది. 

ఇక హైదరాబాద్ నగరంలో సహరి ఉదయం 5 గంటలకు కాగా ఇఫ్తార్ సాయంత్రం 6.27 గంటలకు ఉంటుంది. ఢిల్లీలో సహరి ఉదయం 5.11 గంటలకు కాగా, ఇఫ్తార్ సాయంత్రం 6.32 గంటలకు ఉంటుంది. ముంబైలో సహరి ఉదయం 5.15 గంటలకు కాగా, ఇఫ్తార్ సాయంత్రం 6.36 గంటలకు ఉంటుంది. కోల్‌కతాలో సహరి ఉదయం 4.30 గంటలకు కాగా ఇఫ్తార్ సాయంత్రం 5.47 గంటలకే ఉంటుంది. బెంగళూరులో సహరి ఉదయం 5.15 గంటలకు కాగా ఇఫ్తార్ సాయంత్రం 6.34 గంటలకు ఉంటుంది. 

ఇలా దేశంలో వివిధ నగరాల్లో నిమిషాల తేడాలో సహరి,ఇఫ్తార్ సమయం ఉంటుంది. అదే సమయంలో నెల చివరికి వచ్చేసరికి సహరి సమయం తగ్గుతుంటే..ఇఫ్తార్ సమయం పెరుగుతుంది. అంటే నెల ప్రారంభ సమయంతో పోలిస్తే ముగింపులో సమయం 4-5 నిమిషాలు తేడా ఉంటుంది.

Also read: Ugadi 2023 Horoscope: శోభకృత్ నామ సంవత్సరంలో ఏయే రాశులకు ఎలా ఉంటుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News