Gopichand Malineni Builts Bus Shelter in own Village: తెలుగు సినీ పరిశ్రమలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ మలినేని అతి తక్కువ కాలంలోనే డైరెక్టర్‌గా మారాడు. డైరెక్టర్‌గా మారిన తర్వాత చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయన బ్లాక్ బస్టర్ హిట్లర్ అందుకున్నాడు. మరీ ముఖ్యంగా 2021లో ఆయన రవితేజతో చేసిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాక రవితేజ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.
ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో చేసిన వీర సింహారెడ్డి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలవడమే కాదు నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించగా కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ కుమార్ విలన్ గా నటించారు. ఇక తమిళ స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందించింది.
నందమూరి అభిమానులు అయితే ఈ విషయంలో సూపర్ హ్యాపీగా ఉన్నారు. అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నారని విషయం మీద ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే గోపీచంద్ మలినేని మరో బడా హీరోని లైన్ లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు గోపీచంద్ మలినేని అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కారు. దానికి కారణం ఆయన సొంత గ్రామంలో స్వయంగా తన డబ్బులతో ఒక బస్సు షెల్టర్ నిర్మించడమే. వీరసింహా రెడ్డి దర్శకుడు మలినేని గోపీచంద్ తన సొంత ఊరు అయిన ప్రకాశం జిల్లా ఒంగోలు బొద్దులూరివారిపాలెంలో బస్ షెల్టర్ నిర్మించారని చెబుతూ నందమూరి బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Also Read: Rashmika Mandanna Alert: నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది.. రష్మిక జాగ్రత్తగా మాట్లాడకుంటే ఇబ్బందే!
Also Read: Balagam OTT Release: ఓటీటీలో బలగం సందడి.. దిల్ రాజు పప్పులో కాలేశాడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook