Samantha Dating : ఎవరితో ఒకరితో డేట్ చేయొచ్చు కదా?.. నెటిజన్ ప్రశ్నకు సమంత సమాధానం ఇదే

Samantha Ruth Prabhu Dating సమంత ప్రస్తుతం తన సినిమాలతోనే బిజీగా ఉంది. తాను అసలు ఇప్పుడు ఇలా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, కనీసం తన సినిమాలను చేసుకునే స్థితిలో ఉన్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2023, 08:04 AM IST
  • నెట్టింట్లో సమంత సందడి
  • డేటింగ్ చేయమన్న నెటిజన్
  • నీ కంటే ప్రేమించే వాళ్లు దొరకరన్న సామ్
Samantha Dating : ఎవరితో ఒకరితో డేట్ చేయొచ్చు కదా?.. నెటిజన్ ప్రశ్నకు సమంత సమాధానం ఇదే

Samantha Ruth Prabhu Dating సమంత తాజాగా శాకుంతలం కోసం ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. సుమతో చేసిన ఈ ఇంటర్వ్యూ నెట్టింట్లో బాగానే వైరల్ అయింది. సమంత తన ఆరోగ్యం గురించి చెప్పింది. ఇప్పుడు తాను ఎలా ఉంటుందో వివరించింది. తాను ఇంట్లోంచి బయటకు వచ్చి, ఇలా షూటింగ్‌లు చేయడమే ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే సమంత ఇప్పుడు తన అభిమానితో చెప్పిన విషయం అందరినీ నవ్విస్తోంది. ఆకట్టుకుంటోంది.

సమంత ట్విట్టర్‌, ఇన్‌స్టాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ట్రోలర్లకు ఎలా రియాక్ట్ అవుతుందో.. తన ఫ్యాన్స్ పెట్టే పాజిటివ్ ట్వీట్లకు అంతే రియాక్ట్ అవుతుంటుంది. అయితే సమంతను ఇప్పుడు డేటింగ్ చేయమంటూ ఓ సలహా ఇచ్చారు. ఇది నేను చెప్పాల్సిన విషయం కాదు కానీ.. మీరు ఎవరితోనో ఒకరితో డేటింగ్ చేయొచ్చు కదా? అని సలహా ఇచ్చారు.

అయితే సమంత ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. నీ కంటే బాగా నన్ను ఇంకెవ్వరు ప్రేమిస్తారు అని ఎంతో సరదాగా చెప్పింది. అయితే ఈ ట్వీట్‌కు మాత్రం విపరీతమైన స్పందన వస్తోంది. మేం రెడీ అంటూ సమంత అభిమానులు కామెంట్ల వర్షాన్ని కురిపించారు. సమంత తన శాకుంతలం సినిమా కోసం బాగానే కష్టపడింది. కేజీల చొప్పున నగలు ధరించి సినిమా షూటింగ్ చేసింది.

సమంత తన శకుంతల పాత్ర కోసం ఎంతలా కష్టపడింది, ఎలాంటి వర్కౌట్లు చేసింది.. ఎలాంటి డైట్ మెయింటైన్ చేసింది? అన్నది ఎంతో క్లియర్‌గా చెప్పింది. సినిమా స్క్రిప్ట్ తన వద్దకు వచ్చిన బాడీ బిల్డింగ్ చేసి మజిల్స్, యాబ్స్‌తో ఉందంట. శకుంతల పాత్ర కోసం పూర్తిగా తగ్గిపోవాలని, సాఫ్ట్ అవ్వాలని డిసైడ్ అయిందట. అయితే తాను ఈ సినిమా కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అవన్నీ కూడా సరైనవేనని, సినిమా చూశాక ఎంతో గొప్పగా, సంతోషంగా, సంతృప్తిగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.

Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్

Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News