Monthly Horoscope April 2023: ఏప్రిల్ నెలలో చాలా రాశులవారు మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా పలు గ్రహాలు కూడా రాశి సంచారం దశలో ఉండడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు జరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా బృహస్పతి సంచారం వల్ల ఈ నెల మొత్తం పలు రాశులవారికి చాలా ప్రయోజనాలు కలుగొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏప్రిల్ నెలలో ఏయే రాశులవారి జీవితాల్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నెలలో మంచి రోజులు:
ఉత్తమ రోజులు: 06, 07, 14, 23, 26, 30.
మంచి రోజు: 2, 4, 13, 16, 21, 25, 28, 29.
అశుభ దినాలు: 10, 11, 18, 19, 20.
మేష రాశి:
నెల ప్రారంభంలో మేష రాశివారికి అదృష్టం పరంగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. యువతకు ఈ నెల మొత్తం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలో వారికి చాలా రకాల కొత్త అవకాశాలు లభిస్తాయి. కళాకారులైతే ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గుతాయి. విద్యార్థులు పోటీలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ రాశివారు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ధనలాభంతో పాటు చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
వృషభ రాశి:
ఏప్రిల్ నెలలో వృషభ రాశివారు వ్యాపారాల్లో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఈ క్రమంలో విపరీతంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. రాశి వారు కోర్టు వివాదాల్లో ఉంటే ఈ క్రమంలో సులభంగా విజయాలు సాధిస్తారు. ఈ క్రమంలో ప్రయాణాలు చేస్తే చాలా రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంది. వృషభ రాశివారికి ఈ నెల మొత్తం కుటుంబ సఖ్యత బాగుంటుంది. కొత్త స్థిరాస్తులు కొనుగోలు చేసే యోగం ఉంది. విద్యార్థులు కొత్త రంగాలలో విజయం సాధించడం వల్ల కుటుంబం సభ్యులు శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఈ క్రమంలో విద్యార్థులు విదేశీ భాష నేర్చుకుంటారు. ఈ రాశివారు ఉద్యోగంలో ఉన్నత స్థానానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పరిశ్రమాలు నడిపేవారు భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఈ రాశివారికి నెల మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి:
మిథున రాశివారికి కోపం పెరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలో వీరు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో కుటుంబంలో కలహాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఆనందం కోసం ఎటువంటి కారణం లేకుండా శ్రమిస్తూనే ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. సొంత బంధువులు ఇతరల నుంచి మీరు అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కోపం పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌లున్నాయి. అంతేకాకుండా ఈ రాశివారు భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు వేగాన్ని నియంత్రించడం ముఖ్యం. లేకపోతే తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ప్రయాణాల చేసే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారం చేసేవారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
సింహ రాశి:
ఈ నెలలో ఉద్యోగంలో సీనియర్ల సహకారం వల్ల సింహ రాశివారికి ప్రమోషన్స్ లభిస్తాయి. మీరు ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా గృహాలు క్రయ, విక్రయాల వల్ల భారీ లాభాలు కలుగుతాయి. వాణిజ్య పరిశ్రమలు చేసేవారు మంచి ఫలితాలు పొందుతారు. యువతులకు ఈ నెలలో వివాహ యోగాలుండడం వల్ల పెళ్లిలు జరిగే అవకాశాలున్నాయి. కళారంగంలో పని చేసే వ్యక్తుల ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల కారణంగా ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. ధార్మిక, ఆధ్యాత్మిక సౌఖ్యాన్ని పొందుతారు. కుటుంబ జీవితంలో కూడా మంచి ఆనందాన్ని కూడా పొందుతారు. విద్యార్థులు చదువులో పురోగతి సాధిస్తారు. అయితే సింహ రాశివారు ఆర్థిక పరంగా పలు రకాల జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Honey Rose Pics : బాప్ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ
Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook