Shukra Gochar 2023: ఏప్రిల్ 6న వృషభరాశిలోకి ప్రవేశించనున్న శుక్రుడు.. మరో 4 రోజుల్లో ఈ రాశుల సుడి తిరగనుంది

Shukra gochar 2023:  శుక్ర గ్రహం ఏప్రిల్ 6న వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు లాభం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2023, 11:58 AM IST
Shukra Gochar 2023: ఏప్రిల్ 6న వృషభరాశిలోకి ప్రవేశించనున్న శుక్రుడు.. మరో 4 రోజుల్లో ఈ రాశుల సుడి తిరగనుంది

Venus Transit 2023: మరో నాలుగు రోజుల్లో అంటే ఏప్రిల్ 06న శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు సంచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

శుక్రుడు సంచారం ఈ రాశులకు వరం

వృషభం: వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇదే రాశిలో శుక్రుడి సంచారం జరగబోతుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. 

కన్య: శుక్రుని రాశి మార్పు కన్యా రాశి వారికి అనుకూల ఫలితాలనిస్తుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. 

ధనుస్సు: ధనుస్సు రాశి వారికి శుక్రుడు మంచి లాభాలను ఇవ్వనున్నాడు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. 

Also Read: Chaturgrahi Yog: మేషరాశిలో చతుర్గ్రాహి యోగం.. ఈ 3 రాశులపై కనక వర్షం.. 

Also Read: Ritika Nayak Pics : లోపల ఏమీ వేసుకోకుండా రితికా నాయక్ రచ్చ.. రెచ్చిపోయిన విశ్వక్ సేన్ బ్యూటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News