భారత్ vs ఇంగ్లండ్: టెస్టు సమరానికి రంగం సిద్ధం

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య ఇవాళ్టి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Last Updated : Aug 1, 2018, 01:23 PM IST
భారత్ vs ఇంగ్లండ్: టెస్టు సమరానికి రంగం సిద్ధం

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య ఇవాళ్టి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. టీ20 సిరీస్ విజయంతో ఇంగ్లండ్ పర్యటనను దిగ్విజయంగా మొదలుపెట్టిన కోహ్లీసేనకు వన్డేల్లో ఊహించని ఫలితం ఎదురుకాగా.. టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. కాగా ఈ టెస్టు మ్యాచ్ సిరీస్‌లో కోహ్లీ రాణిస్తే ఐసీసీ ర్యాకింగ్స్2లో నెంబర్ 1 స్థానానికి చేరుకొనే అవకాశం ఉంది.  చివరిసారిగా భారత్‌ ఇంగ్లండ్‌లో టెస్ట్‌ సిరీస్‌ను 2007లో రాహుల్‌ ద్రావిడ్‌ ఆధ్వర్యంలో గెలుచుకుంది.  

ఈసారి భారత టెస్ట్‌ జట్టులో రోహిత్‌ శర్మకు బదులు అజింక్య రహానేకు చోటు దక్కింది. కెఎల్‌ రాహుల్‌కు ఈసారి ఓపెనెర్‌గా బరిలోకి దిగవచ్చు. మిడిలార్డర్‌లో కోహ్లీ, రహానే, రాహుల్‌, హార్దిక్‌ పాండ్యాలతో కూడిన లైనప్‌ బాగానే ఉన్నారు. బౌలింగ్‌లో ఆశ్విన్‌, ఇశాంత్‌, ఉమేష్‌, మహ్మద్‌ షమీలున్నారు.

కాగా.. బర్మింగ్‌హామ్‌లో ఆడిన ఆరు టెస్టుల్లో భారత్‌ ఐదు మ్యాచ్‌ల్లో ఓడి, ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 2005 నుంచి ఇక్కడ పది మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్‌ ఒకేసారి ఓడిపోయింది.

తుది జట్ల వివరాలు

ఇంగ్లాండ్‌: అలిస్టర్‌ కుక్‌, కీటన్‌ జెన్నింగ్‌స, జో రూట్‌, డేవిడ్‌ మలన్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, అదిల్‌ రషీద్‌, సామ్‌ కురన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌

భారత్‌ (అంచనా): విజయ్‌, ధావన్‌/రాహుల్‌, పుజారా, కోహ్లి, రహానె, కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌, షమి, ఇషాంత్‌, ఉమేశ్‌.

Trending News