Sadabahar Leaves cure Diabetes, BP & Joint Pains:: ప్రస్తుతం భారతదేశంలో డయాబెటిస్ బారిన కోట్ల మంది పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు జన్యుపరమైనవి గాని, అనారోగ్య ఆహారలపరంగా కానీ వస్తున్నాయని నిపుణులు పేర్కోన్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగకుండా ఉండడానికి తప్పకుండా కొన్ని ఆయుర్వేద మూలికలు కలిగిన చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది.
బిళ్ళ గన్నేరు మొక్కతో మధుమేహానికి చెక్:
బిళ్ళ గన్నేరు మొక్క శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే బిళ్ళ గన్నేరు మొక్క ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఔషధ గుణాలతో నిండి ఉంటుంది:
బిళ్ళ గన్నేరు మొక్క శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. మధుమేహం మాత్రమే కాదు, గొంతు నొప్పి, లుకేమియా, మలేరియా వంటి వ్యాధులను దూరం చేయడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఈ మొక్కలో ఆల్కలాయిడ్స్, టానిన్లు వంటి ముఖ్యమైన సమ్మేళనాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: Gas Price: గుడ్‌న్యూస్.. గ్యాస్ ధరలు భారీగా తగ్గే అవకాశం.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది:
బిళ్ళ గన్నేరులో మడగాస్కర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సులభంగా భారతదేశంలో కూడా లభిస్తాయి. అయితే తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ పువ్వును వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే మధుమేహం సమస్యలతో బాధపడేవారు, ముఖ్యంగా టైప్-2 మధుమేహం సమస్యలున్నవారు ఈ బిళ్ళ గన్నేరు పువ్వును వినియోగించడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
బిళ్ళ గన్నేరును ఎలా వినియోగించాలి?
బిళ్ళ గన్నేరు మొక్కలను తీసుకుని, ఆకులను వేరు చేయాలి. వాటిని ఎండలో ఎండబెట్టి పొడిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పొడిని నీళ్లతో లేదా తాజా పండ్ల రసంతో కలిపి రోజూ తినాలి. మీరు ప్రతిరోజూ 2 నుంచి 4 ఆకులను నమలవచ్చు. ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్zతుంది. అంతేకాకుండా ఈ ఆకులను డికాషన్ చేసి తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: KKR vs RCB Highlights: రూ.20 లక్షల ఆటగాడు.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ.. ఆర్‌సీబీపై విశ్మరూపం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook