Rajamouli Weapons List in his Movies: వాస్తవానికి రాజమౌళి ఒక్కొక్క సినిమా ద్వారా ఒక్కొక్క వెపన్ ను చాలా స్టైలిష్ గా డిజైన్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరు గమనించినట్లయితే ఆయన మాస్ సినిమాలు చేయడం మొదలుపెట్టిన సింహాద్రి సినిమా మొదలు మొన్నటి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు స్పెషల్ గా ఈ ఆయుధాలను డిజైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పటివరకు రాజమౌళి ఏ ఏ సినిమాకు ఎలాంటి వెపన్స్ వాడారు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం చూసేయండి మరి.
సింహాద్రి
సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ కోసమే స్పెషల్ గా డిజైన్ చేసిన సింగమలై వెపన్ ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి యూత్ అంతా ఈ వెపన్ భలే ఉందిరా అనుకునేవారు.
ఛత్రపతి
ఇక ఛత్రపతిసినిమాలో గొడ్డలిని పోలి ఉండే ఒక రకమైన కత్తిని రాజమౌళి డిజైన్ చేస్తారు. ఆ కత్తి విపరీతంగా ఆ రోజుల్లో ఫేమస్ అయిపోయింది.
విక్రమార్కుడు
రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన విక్రమార్కుడు సినిమాలో ఒక రాడ్ కి విష్ణు చక్రంని పోలిన ఒక చక్రాన్ని అమర్చి ఒక కొత్త ఆయుధాన్ని సృష్టించారు. విలన్లను రవితేజ ఆ ఆయుధంతో నరుకుతుంటే థియేటర్లలో ప్రేక్షకులు ఉగ్రరూపం వచ్చినట్టు ఊగిపోయారు అప్పట్లో.
Also Read: Nandita Swetha Sizzling: టైట్ ఫిట్ డ్రెస్సులో నందితా శ్వేతా.. భారీ అందాలతో హాట్ ట్రీట్
ఈగ
ఇక నాని హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈగ సినిమాలో నాని కోసం స్పెషల్ గా ఎలాంటి ఆయుధాన్ని డిజైన్ చేయలేదు. కానీ నాని చనిపోయిన తర్వాత ఈగగా పుడితే ఈగ కోసం ఒక సూదిని సిద్ధం చేశారు.
యమదొంగ
ఇక యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కోసమే డిజైన్ చేసినట్లుగా ఉన్న యమపాషాన్ని అందరూ గమనించే ఉంటారు దాన్ని ఒక ఆయుధంలా ఇష్టం వచ్చినట్టు వాడి పడేసాడు ఎన్టీఆర్. ఇక అప్పట్లో గద కూడా మామూలు సినిమాల్లో ఉన్న వాటికంటే చాలా భిన్నంగా స్టైలిష్ గా సిద్ధం చేయించాడు జక్కన్న.
మగధీర
ఇక మగధీర సినిమాలో రామ్ చరణ్ కోసమే ఒక రకమైన కత్తిని సిద్ధం చేయించారు. చూడడానికి అది సాధారణంగానే కనిపించినా దాని మీద ఉన్న సింబల్ మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉండేవి. ఈసారి ఎప్పుడైనా గమనించండి
బాహుబలి
ఇక బాహుబలి మొదటి భాగం రెండో భాగంలో బాహుబలి కోసమే సిద్ధం చేయించినట్లు గా ఉన్న గుర్రం తలకాయతో కూడిన కత్తి అందరికీ గుర్తుండే ఉంటుంది. కట్టప్ప వెన్నుపోటు పొడిచిన తర్వాత కూడా అదే కత్తిని చేతిలో ధరించి కనిపిస్తూ ఉంటాడు బాహుబలి. అది మాత్రమే కాదు భళ్లాల దేవుడి చేతిలో అనేక రకాల వెపన్స్ కూడా మనం చూసే ఉంటాం. ఇవన్నీ కేవలం రాజమౌళి సృష్టించినవి మాత్రమే బయట ఎక్కడ కనపడవు అంటే అతిశయోక్తి కాదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook