International Prize in Statistics 2023: ప్రపంచ ప్రఖ్యాత స్టాటిస్టిక్స్ నిపుణుడు, భారతీయ-అమెరికన్ గణాంకవేత్త కల్యంపూడి రాధాకృష్ణారావుకు అరుదైన గౌరవం దక్కింది. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్ గా భావించే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు ఈ సంవత్సరానికి గాను లభించింది.
రెండేళ్లకొకసారి ఇచ్చే ఈ పురస్కారాన్ని 2016లో స్టార్ట్ చేశారు. గణాంకాలను ఉపయోగించడం ద్వారా సైన్స్, టెక్నాలజీ మరియు మానవ సంక్షేమానికి గణనీయమైన కృషి చేసిన వ్యక్తి లేదా బృందానికి ఈ అవార్డును ఇస్తారు. ఐదు ప్రధాన అంతర్జాతీయ గణాంకాల సంస్థల సహకారంతో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. వచ్చే జులైలో కెనడాలోని ఒట్టావాలో జరిగే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ కాంగ్రెస్‌లో రావును ఈ పురస్కారంతో సత్కరిస్తారు. అంతేకాకుండా 80వేల డాలర్ల నగదు బహుమతిని కూడా అందించనున్నారు.
1945లో కలకత్తా మ్యాథమెటికల్ సొసైటీ బులెటిన్‌లో ప్రచురించిన సీఆర్ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. ఆధునిక గణాంకాల రంగానికి మార్గం సుగమం చేసిన రావు.. మూడు ప్రాథమిక ఫలితాలను ప్రదర్శించారు. ఇప్పటికి వాటిని సైన్స్‌లో ఉపయోగిస్తున్నారు. "75 సంవత్సరాల క్రితం సైన్స్‌పై తనదైన ముద్ర వేసిన C.R. రావుకు 2023 అంతర్జాతీయ గణాంక బహుమతి లభించిందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాం" అని అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ ప్రైజ్ ఏప్రిల్ 3న ట్వీట్ చేసింది.
Also Read: PM Modi New Look: ప్రధాని మోదీ నయా లుక్ అదిరిందిగా..!
సీఆర్ రావు గురించి.
కల్యంపూడి రాధాకృష్ణారావు 1920లో కర్ణాటకలో జన్మించారు. అతను కోల్‌కతాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు మరియు 1941 నుండి ఇన్స్టిట్యూట్తో అనుబంధం కలిగి ఉన్నాడు. రావు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి PhD మరియు ScD డిగ్రీలను తీసుకున్నారు. 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్, 1963లో SS భట్నాగర్ అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా 1967లో రాయల్ సొసైటీకి ఫెలోగా ఎన్నికయ్యారు. అతను అమెరికన్ స్టాటిస్టికల్ యొక్క విల్క్స్ మెడల్‌ను కూడా ఆయన అందుకున్నారు.
Also Read: India Covid-19 Updates: కలవరపెడుతున్న కరోనా... మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి