Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇంకా నామినేషన్ల పర్వం ముగియకుండానే రెబెల్, అసంతృప్తుల బెడద పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిజాబ్ ఆందోళన లీడ్ చేసిన ఎమ్మెల్యేకు ఆ పార్టీ షాక్ ఇచ్చింది.
కర్ణాటకలో ప్రస్తుతం అధికార బీజేపీ, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, జేడీయూలు టికెట్ల జాబితా విడుదల చేస్తున్నాయి. టికెట్ దక్కని అసంతృప్తులు సహజంగానే సమస్యగా మారుతున్నారు. అదే సమయంలో బీజేపీ ఓ కీలకమైన ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించి షాక్ ఇచ్చింది. కర్ణాటక ఉడిపి నుంచి ప్రారంభమైన హిజాబ్ ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిజాబ్ ధారణను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన ఆందోళనకు అక్కడి ప్రభుత్వం మద్దతుగా నిలవడం, హైకోర్టు సైతం సమర్ధించడం వంటి పరిణాలు చోటుచేసుకున్నాయి. ఈ హిజాబ్ ఆందోళనను లీడ్ చేసి వార్తల్లోకెక్కిన ఉడుపి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘుపతి భట్‌కు బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. అతని స్థానంలో యశ్పాల్ సువర్ణను అభ్యర్ధిగా ప్రకటించింది.
ఈ పరిణామంపై రఘుపతి భట్ మీడియా ముందు ఏడ్చినంత పని చేశారు. టికెట్ ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయంపై తానేమీ బాధపడటం లేదని, కానీ తనను పార్టీ ట్రీట్ చేసిన విధానమే నచ్చలేదంటున్నారు. తనకు టికెట్ ఇవ్వడం లేదనే సమాచారాన్ని కనీసం జిల్లా అధ్యక్షుడైనా చెప్పలేదన్నారు. టీవీ ఛానెళ్ల ద్వారా ఈ విషయం తెలుసుకున్నానని బాదపడ్డారు రఘుపతి భట్. కేవలం నా కులం చూసి నాకు టికెట్ తిరస్కరిస్తే నేను అంగీకరించనన్నారు.
అలుపు లేకుండా నిరంతరం పనిచేసేవారు బీజేపీకు అవసరం లేదేమోనని భట్ అన్నారు. పార్టీ ఎక్కడికి వెళ్లినా విజయం సాధిస్తున్నందున తనలాంటి వ్యక్తుల అవసరం లేదని పార్టీ బావిస్తుందేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. కఠిన సమయాల్లో పార్టీ కోసం పనిచేశానని..తనకిచ్చిన అవకాశాలకు కృతజ్ఞుడినై ఉంటానన్నారు. ఉడుపి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న యశ్పాల్ సువర్ణ అభివృద్ధికి తాను పాటుపడ్డానని గుర్తు చేశారు.
Also Read: Fake Hospital Busted: ఫేక్ హాస్పిటల్.. ఇక్కడ డాక్టర్ కూడా ఫేకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook