మద్యం వ్యాపారి విజయ్ మాల్యా బుధవారం మరోసారి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు హాజరయ్యారు. మాల్యాను భారత్‌కు అప్పగిస్తే ఆయన్ను ఉంచనున్న ముంబై ఆర్థర్ రోడ్ జైలులోని సెల్ వీడియో దృశ్యాలను ఈరోజు జరిగే విచారణలో న్యాయమూర్తి ఎమ్మా ఆర్బర్త్‌నాట్ పరిశీలిస్తారు.
కోర్టు లోపల వెళ్లడానికి ముందు, మాల్యా విలేకరులతో మాట్లాడారు. అయన మాట్లాడుతూ.. తాను "సమగ్రమైన" పరిష్కారాన్ని ఇచ్చానని చెప్పారు. "నేను భారతదేశంలో కర్ణాటక హైకోర్టుకు ముందు సమగ్ర పరిష్కార ప్రతిపాదన చేశాను. గౌరవప్రదమైన న్యాయమూర్తులు ఈ ప్రతిపాదనను అనుకూలంగా పరిగణించవచ్చని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి డబ్బులు చెల్లిస్తాను. అదే నా ప్రాథమిక లక్ష్యం" అని అన్నారు. అందరి బాకీలు తీర్చేందుకు సెటిల్మెంట్ ఆఫర్ ఇవ్వడం జరిగిందని .. సెప్టెంబరు 18న విచారణ జరుగుతుందని విజయ్ మాల్యా చెప్పారు.
ఎస్బీఐ నుంచి సుమారు 9 వేల కోట్ల రుణాలు తీసుకున్న కేసులో మాల్యా పరారీలో ఉన్నారు. భారత్‌లో జైళ్లు బ్రిటన్ ప్రమాణాలకు అనుగుణంగా లేనందున, తనను భారత్‌కు అప్పగించవద్దని గతంలో మాల్యా బ్రిటిష్ కోర్టుకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
Obviously, that is why a settlement offer has been made. The hearing is on 18th September: Vijay Mallya, outside Westminster Magistrates Court in London, when asked if he has convinced the Court the he has the means to pay what he said he will. pic.twitter.com/zoIgV6zIIV
— ANI (@ANI) September 12, 2018