TRS MLC kavitha to ATA Meeting: ఆటా మహాసభలకు కల్వకుంట్ల కవిత

kavitha to ATA Meeting: వాషింగ్టన్‌ డీసీలో జరిగే  అమెరికన్ తెలుగు అసోసియేషన్‌ మహాసభల్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆటా ప్రతినిధుల నుంచి ఆహ్వానం అందింది. ఆటా నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆటా మహాసభలకు హాజరయ్యేందుకు కవిత అంగీకారం తెలిపారు. 

Written by - Saptagiri | Last Updated : Jun 29, 2022, 06:49 PM IST
  • అమెరికాలో జరిగే ఆటా మహాసభలకు కల్వకుంట్ల కవిత
  • వాషింగ్టన్‌ డీసీలో ఆటా మహాసభలతో పాటు.. యూత్‌ కన్వెన్షన్‌
  • ప్రైమ్‌ మీట్‌లో సుమారు 10వేల మంది ప్రతినిధులు
TRS MLC kavitha to ATA Meeting: ఆటా మహాసభలకు కల్వకుంట్ల కవిత

TRS MLC Kavitha to ATA Meeting: కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్‌ మహాసభల్లో ఆమె పాల్గొంటారు. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు ఆటా 17వ మహాసభలు జరగనున్నాయి. వాషింగ్టన్‌ డీసీలో ఆటా మహాసభలతో పాటు.. యూత్‌ కన్వెన్షన్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆటా మహాసభలకు హాజరయ్యేందుకు కవిత అంగీకారం తెలిపారు. 

ఆటా మహాసభల రెండోరోజైన జూలై 2వ తేదీన కవిత ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్‌ను కవిత ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం జరగనున్న ఆటా ప్రైమ్‌ మీట్‌లో కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ ప్రైమ్‌ మీట్‌లో సుమారు 10వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఆ సమావేశంలో భాగంగా బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరిస్తారు. ప్రతి యేటా జరిగే ఈ ఉత్సవాలను ఈసారి మరింత పెద్ద ఎత్తున  నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు సజావుగా జరిగేలా వందల మంది వాలంటీర్లు 80 కమిటీలుగా ఏర్పడి నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు.

Also read : Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య.. నల్ల జాతీయుడి కాల్పుల్లో మృతి

Also read : Revanth reddy in America: డల్లాస్‌లో సందడిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News