మాలావత్ పూర్ణకు ఎన్నారైల అభినందనలు

తెలంగాణ కు చెందిన మాలావత్ పూర్ణ పర్వతాలు ఎక్కడంలో తనకు తనే సాటి .. తాజాగా ప్రపంచంలోని అతిఎత్తైన పర్వతాల్లో ఒకటైన ‘మౌంట్ విన్సన్ మసిఫ్’ను అధిరోహించి తన సత్తా చాటారు. 2014లో స్కూల్ లో చదువుకునే వయసులోనే ఎవరెస్ట్ ఎక్కిన ఘనత పూర్ణది. దానితో పాటు… ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్ లోని ఎల్బ్రాస్, సౌత్ అమెరికాలోని అకోన్ కాగ్వా, ఓషినియా రిజియన్ లోని కార్ట్స్ నెజ్ ను కూడా ఎక్కారు.

Last Updated : Jan 2, 2020, 09:12 PM IST
మాలావత్ పూర్ణకు ఎన్నారైల అభినందనలు

అమెరికా: తెలంగాణ కు చెందిన మాలావత్ పూర్ణ పర్వతాలు ఎక్కడంలో తనకు తనే సాటి .. తాజాగా ప్రపంచంలోని అతిఎత్తైన పర్వతాల్లో ఒకటైన ‘మౌంట్ విన్సన్ మసిఫ్’ను అధిరోహించి తన సత్తా చాటారు. 2014లో స్కూల్ లో చదువుకునే వయసులోనే ఎవరెస్ట్ ఎక్కిన ఘనత పూర్ణది. దానితో పాటు… ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్ లోని ఎల్బ్రాస్, సౌత్ అమెరికాలోని అకోన్ కాగ్వా, ఓషినియా రిజియన్ లోని కార్ట్స్ నెజ్ ను కూడా ఎక్కారు.

ఈ క్రమం లో  ‘మౌంట్ విన్సన్’ ను అధిరోహించిన పూర్ణను అభినందిస్తూ డల్లాస్ లోని తెలంగాణకు చెందిన ఎన్నారైలు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించడానికి తాను తీసుకున్న శిక్షణ, జాగ్రత్తలు, మొదలగు విషయాలను అక్కడున్న ఎన్నారై లతో పూర్ణ తన అనుభవాలను పంచుకున్నారు. 

పర్వతాలపై ఉండే వాతావరణం, అక్కడి పరిస్థితులను తాను తీసిన ఫొటోలను ఎన్నారైలకు చూపించారు. అతి త్వరలోనే ‘ఎదో’ పర్వతాన్ని సైతం అధిరోహించి తన చిరకాల కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పర్వతారోహణలో ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇప్పిస్తానని ఎన్నారైలతో పూర్ణ చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందన .. 

పూర్ణా మాలావత్ 26 డిసెంబర్ 2019 న అంటార్కిటికా యొక్క మౌంట్ విన్సన్ శిఖరాన్ని స్కేల్ చేసినందుకు అభినందనలు. ఖండాల్లోని ఆరు ఎత్తైన శిఖరాలను వరుసగా అధిరోహించడం ద్వారా, ధనిక మరియు పేదల మధ్య అంతరం కేవలం ఒక అవకాశమని మీరు మరోసారి నిరూపించారని తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖా కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొనియాడారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News