DA Merger in Basic Salary in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కోటికి పైగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏ 3 శాతం పెంచడంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. మరిప్పుడు మొత్తం డీఏను కనీస వేతనంలో విలీనం చేస్తారా లేదా , ప్రభుత్వం ఏ చెబుతోంది.. ఆ వివరాలు మీ కోసం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన డీఏ పెంపు ప్రకటన నిన్న అంటే అక్టోబర్ 16న వెలువడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేృత్వత్యంలో జరిగిన కేబినెట్ భేటీలో డీఏ 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జూలై నెల నుంచి డీఏ ఎరియర్లను అక్టోబర్ నెల జీతంతో అందించనున్నారు.
అయితే ఇప్పుడు మొత్తం డీఏ 50 నుంచి 53 శాతానికి చేరుకుంది. దాంతో డీఏను కనీస వేతనంలో కలుపుతారా లేదా అనే ప్రశ్న ఎదురైంది. జీతంలో కలిపితే డీఏ సున్నా నుంచి లెక్కిస్తారు. అటు బేసిక్ శాలరీ భారీగా పెరుగుతుంది. ఫలితంగా రానున్న రోజుల్లో అలవెన్సులు భారీగా ఉంటాయి. ప్రభుత్వం దీనిపై ప్రకటన విడుదల చేసింది.
డీఏ, డీఆర్ 50 శాతం దాటితే రెండూ బేసిక్ శాలరీలో కలిసిపోతాయి. ఈ ప్రస్తావన 6వ వేతన సంఘంలో ఉంది. డీఏ 50 శాతం దాటితే బేసిక్ శాలరీలో కలపాలనేది. అందుకే ఉద్యోగుల్లో ఈ విషయంపై పలు సందేహాలు ప్రారంభమయ్యాయి.
5వ, 6వ వేతన సంఘంలో బేసీక్ శాలరీలో డీఏ కలిపే ప్రస్తావన ఉంది. దాని ప్రకారం 2004లో 50 శాతం డీఏను బేసిక్ శాలరీలో కలిపారు. ఇప్పుడు మళ్లీ కలుపుతారా లేదా అనేది సంశయంగా మారింది. ఎందుకంటే ఇది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 53 శాతం డీఏ అందుకుంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. డీఏను బేసిక్ శాలరీలో కలిపే విషయమై ప్రభుత్వం చర్చిస్తోందని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.