Modi Chandrbabu: బడ్జెట్‌లో ఏపీకి భారీ కేటాయింపులు.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu Meets PM Narendra Modi: ఆంధ్రప్రదేశ్‌కు భారీ కేటాయింపులు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రధానితో చంద్రబాబు కొన్ని నిమిషాల సేపు సమావేశమయ్యారు.

1 /7

దేశ రాజధాని ఢిల్లీలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దాదాపు గంటకు పైన చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర అంశాలతోపాటు రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

2 /7

రాష్ట్ర పరిస్థితులు, ఏపీ అభివృద్ధికి సహకారం వంటి అంశాలను ప్రధాని దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు.

3 /7

ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు.. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు చర్చించారు.

4 /7

అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్ లో ప్రతిపాదించిన రూ.15 వేల కోట్ల ఆర్ధిక సాయాన్ని వేగవంతం చేయాలని ప్రధాని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

5 /7

వైజాగ్ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

6 /7

పోలవరం నిర్మాణానికి సహకారం, వరద సెస్‌కు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరారు.

7 /7

ప్రధాని మోదీతో భేటీకి ముందు ఢిల్లీలో మాజీ ప్రధాని అటల్‌ బిహార్‌ వాజ్‌పేయికి నివాళులర్పించడంతోపాటు ఎన్డీయే పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన విజ్ఞప్తులు చేశారు.